ETV Bharat / state

సరికొత్త పంథాలో ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో నిరుద్యోగ యువతకు శిక్షణ - traing in driving

ఆర్టీసీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం. ఆ విశ్వాసంతోనే ఇప్పుడు రవాణా సంస్థ అనేక రంగాల్లో అడుగుపెడుతోంది. ఇప్పటివరకు ఆర్టీసీ డ్రైవర్లకు మాత్రమే శిక్షణలో మెళకువలు నేర్పిస్తున్న ఆర్టీసీ.. ఇప్పుడు నిరుద్యోగ యువతీ, యువకులకూ డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఆర్టీసీలో అపారమైన అనుభవం ఉన్న డ్రైవర్లను నాణ్యమైన శిక్షణ ఇచ్చేందుకు ఎంచుకున్నారు. థియరీ, ప్రాక్టికల్స్​లో రెండింటిలో తర్ఫీదిస్తూ డ్రైవింగ్‌లో నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుతున్నారు.

TSRTC training for unemployed youth in driving
సరికొత్త పంథాలో ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో నిరుద్యోగ యువతకు శిక్షణ
author img

By

Published : Nov 1, 2020, 5:14 AM IST

సరికొత్త పంథాలో ఆర్టీసీ.. డ్రైవింగ్‌లో నిరుద్యోగ యువతకు శిక్షణ

దేశవ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా నైపుణ్యం లేని డ్రైవర్ల వల్లే జరుగుతున్నాయని రవాణాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిని అధిగమించేందుకు నిరుద్యోగ యువతీ, యువకులకు నైపుణ్యమైన, నాణ్యమైన డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా భారీ మోటార్ వాహనాలు, లైట్ మోటార్ వాహనాలకు జోనల్ స్టాఫ్ శిక్షణ కేంద్రం... వరంగల్, హకీంపేట్ కేంద్రాల్లో నిరుద్యోగ యువతీ, యువకులకు డ్రైవింగ్‌లో శిక్షణ అందిస్తున్నారు. వీటితో పాటు మరో 30 శిక్షణ కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్టీసీ కృషి చేస్తోంది. ఈ 30 కేంద్రాల్లో ఇప్పటికే మూడు కేంద్రాల్లో ఆర్టీఏ నుంచి అనుమతులు రావడం వల్ల కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్-2 డిపో, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, జగిత్యాల కేంద్రాల్లో డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ప్రారంభించింది. మరో 27 కేంద్రాల్లో శిక్షణ సంస్థలను ప్రారంభించేందుకు ఆయా రవాణాశాఖ కార్యాలయాల్లో దరఖాస్తులను సమర్పించింది. వాటి నుంచి అనుమతులు రాగానే మిగిలిన వాటిని ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది.

సంప్రదించిన ప్రభుత్వ సంస్థలు

వరంగల్, హకీంపేట్ శిక్షణా కేంద్రాల్లో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు అనేక ప్రభుత్వ సంస్థలు సంప్రదించాయి. ఇప్పటికే ఎస్సీ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని 72 మందికి శిక్షణ అందించారు. వీరిలో లైట్ మోటార్ వాహనాలకు 50 మందికి, హెవీ మోటార్ వాహనాలకు 22 మందికి శిక్షణనిచ్చారు. సింగరేణి కాలరీస్ లిమిటెడ్ సంస్థ పంపించిన 40 యువకులకు ఎల్​ఎంవీలో తర్ఫీదు ఇచ్చారు. వరంగల్‌లోని శిక్షణ కళాశాలలో ఐటీడీఏ సిబ్బందిలోని 43 మందికి శిక్షణనిచ్చారు. ప్రస్తుతం ట్రైకార్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా కూడా నిరుద్యోగ యువతీ, యువకులకు శిక్షణ అందించనున్నట్లు హకీంపేట్ జెడ్​ఎస్టీసీ శిక్షణా కేంద్రం ప్రిన్సిపల్ సుచరిత తెలిపారు. భారీ మోటారు వాహనాల నెల రోజుల శిక్షణకు 15వేల600 ఫీజును నిర్ణయించారు. శిక్షణానంతరం టీఎస్​ఆర్టీసీ ధ్రువపత్రాన్ని అందజేస్తారు. లైట్ మోటార్ వాహనాలకు 20 రోజుల శిక్షణ మాత్రమే ఉంటుంది. దీంట్లో శిక్షణ పొందేవారికి 7వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కట్ సెక్షన్ మోడల్స్‌తో శిక్షణ

ఆర్టీసీలో అభ్యర్థులకు కట్ సెక్షన్ మోడల్స్‌తో శిక్షణ అందిస్తున్నారు. భారీ మోటార్ వాహనాల్లో ఉండే ఇంజిన్, గేర్ బాక్స్, ఫ్రంట్ యాక్సిల్, రియల్ ఆక్సిల్ వంటివి ఎలా పనిచేస్తాయో... ప్రత్యక్షంగా వాటిని చూపిస్తూ శిక్షణ అందిస్తారు. డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌తో అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నారు. డ్రైవింగ్‌లో బోధన, ట్రాఫిక్ ఎడ్యుకేషన్, వాహన మెకానిజంపై బోధన, ఫస్ట్ ఎయిడ్ వినియోగం, కస్టమర్ రిలేషన్స్‌పై అవగాహన, మోటార్ వాహనాల నిబంధనలపై పాఠాలు, వాహనాల నిర్వహణ ప్రాక్టికల్ వంటి వాటిలో మెలకువలు నేర్పిస్తున్నారు. వీటితో పాటు అభ్యర్థులకు రాత్రివేళలో ఘాట్ సెక్షన్‌లో, జాతీయ రహదారులపై, రాష్ట్ర రహదారులపై, గ్రామీణ ప్రాంతాల రోడ్లపై శిక్షణ ఇస్తారు.

ఇవీ చూడండి: రైతు బంధు, మిషన్‌ భగీరథ నీళ్లు మంచిగా వస్తున్నయా?: సీఎం కేసీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.