కరోనా ప్రభావంతో తెలంగాణ ఆర్టీసీకి రూ. 2,600 కోట్ల నష్టం వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ (puvvada ajay kumar)వెల్లడించారు. సమష్టి కృషితోనే ఆర్టీసీ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. రవాణాశాఖ మంత్రి, సంస్థ ఎండీ, ఈడీలు, ఉన్నతాధికారులు, సూపర్ వైజర్లు, ఉద్యోగులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ సంస్థను అభివృద్ధిలోకి తేవడానికి కృషి చేస్తున్నారని వివరించారు. రవాణాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీఎండీలతో చర్చించిన తర్వాత సరైన నిర్ణయాలు తీసుకోనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
టీఎస్ ఆర్టీసీకి సీఎం కేసీఆర్ ఆశీస్సులు, ప్రభుత్వం హామీ మేరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1000కోట్ల రుణం ఇవ్వడానికి ఒప్పుకుందన్నారు. మొదటి దఫాగా రూ.500 కోట్లు విడుదల చేసిందని, మిగతా రూ.500ల కోట్లు ఒక నెల తర్వాత ఇస్తామన్నరని తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత ఆయన సూచన మేరకు ఈ డబ్బులను ప్రాధాన్యతను బట్టి అవసరమైన వాటికి వినియోగించనున్నట్టు చెప్పారు.
ఇదీ చూడండి: TSRTC: ప్రజారవాణాలో తగ్గిపోతున్న ఆర్టీసీ ప్రాభవం.. కోట్లలో నష్టం