TSRTC Pallevelugu Town Bus pass Details : ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్ విధానానికి శ్రీకారం చుట్టింది. మొట్టమొదటగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో తిరిగే పల్లె వెలుగు బస్సుల్లో ఈ పాస్‌లను అమలు చేయాలని సంస్థ నిర్ణయించింది. వాటికి వచ్చే ఆదరణను బట్టి మిగతా జిల్లాల్లోనూ పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్‌లను అమలు చేయాలని యాజమాన్యం ఆలోచన చేస్తుంది.
TSRTC Latest News : పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్‌తో ప్రయాణికులు కరీంనగర్, మహబూబ్‌నగర్ నగరాల్లో 10 కిలో మీటర్లు, నిజామాబాద్, నల్లగొండ నగరాల్లో 5 కిలోమీటర్ల పరిధిలో అపరిమిత ప్రయాణం చేయొచ్చు. 10 కిలోమీటర్ల పరిధికి నెలకు రూ.800, 5 కిలోమీటర్ల పరిధికి రూ.500గా పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్ ధరను ఆర్టీసీ సంస్థ ఖరారు చేసింది. ఇప్పటికే హైదరాబాద్, వరంగల్‌లో జనరల్ బస్‌పాస్ సదుపాయం అందుబాటులో ఉంది. ఆ బస్‌పాస్‌ను జిల్లా కేంద్రాల్లోనూ అమలు చేయాలని ప్రయాణికుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు కొత్తగా పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్‌ను సంస్థ తీసుకొచ్చింది.
త్వరలో మరిన్ని ప్రాంతాలకు..: హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో ఇవాళ పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్ పోస్టర్లను సంస్థ ఉన్నతాధికారులతో కలిసి టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. కొత్త టౌన్పాస్లు రేపటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారు. వారి ఆర్థిక భారం తగ్గించేందుకు పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్‌ను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. మొదటిగా కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లా కేంద్రాల్లో ఈ పాస్‌ను అమలు చేస్తున్నామని ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయాలకు అనుగుణంగా మరిన్ని ప్రాంతాలకు పల్లె వెలుగు టౌన్ బస్‌పాస్‌ను విస్తరిస్తామన్నారు.
ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి..: గతంలో బస్సు ధరలను గమనిస్తే.. 10 కిలోమీటర్ల పరిధికి రూ.1200, 5 కిలోమీటర్ల పరిధికి రూ.800 ధర ఉండగా ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో బస్‌పాస్‌లకు సంస్థ రాయితీ కల్పించింది. ఇక నుంచి 10 కిలోమీటర్ల పరిధికి రూ.800, 5 కిలో మీటర్ల పరిధికి రూ.500గా పాస్ ధరను నిర్ణయించింది. కొత్తగా తీసుకువచ్చిన ఈ పాస్ విధానాన్ని హైదరాబాద్, వరంగల్‌లో మాదిరిగానే ప్రయాణికులు ఆదరించి.. సంస్థను మరింత ప్రోత్సహించాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ కోరారు. ఈ బస్‌పాస్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033లలో సంప్రదించాలని ఆయన సూచించారు.
-
ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను #TSRTC అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఇవాళ ఈ బస్ పాస్ పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు.@TSRTCHQ @tsrtcmdoffice @SajjanarVC @CTMOTSRTC pic.twitter.com/do4v3ZcAjC
— PRO, TSRTC (@PROTSRTC) July 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను #TSRTC అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఇవాళ ఈ బస్ పాస్ పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు.@TSRTCHQ @tsrtcmdoffice @SajjanarVC @CTMOTSRTC pic.twitter.com/do4v3ZcAjC
— PRO, TSRTC (@PROTSRTC) July 17, 2023ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా “పల్లె వెలుగు టౌన్ బస్ పాస్” ను #TSRTC అందుబాటులోకి తీసుకువచ్చింది. హైదరాబాద్ లోని బస్ భవన్ లో ఇవాళ ఈ బస్ పాస్ పోస్టర్లను సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు.@TSRTCHQ @tsrtcmdoffice @SajjanarVC @CTMOTSRTC pic.twitter.com/do4v3ZcAjC
— PRO, TSRTC (@PROTSRTC) July 17, 2023
ఇవీ చదవండి..: