TSRTC sankranthi offer: తెలంగాణ ఆర్టీసీ బంపర్ఆఫర్ ప్రకటించింది. డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడప్లస్ బస్సుల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్‌కి ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ప్రకటించాలని సంస్థ నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జానర్ తెలిపారు. ఈ రాయితీ సదుపాయాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని వారు సూచించారు. ముందస్తు రిజర్వేషన్ కొరకు www.tsrtconline.in ని సంప్రదించాలన్నారు.
ఇవీ చదవండి: