TSRTC Electric Buses Inauguration in Hyderabad : ఎలక్రిక్ బస్సులకు అప్పట్లో కేంద్రం సబ్సీడీ ఇచ్చేదని.. ప్రస్తుతం చేతులెత్తేసిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ విషయంలో చేయూత ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రం ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వద్ద ఆర్టీసీ ఎండీ సజ్జన్నర్తో కలిసి మంత్రి 25 గ్రీన్ మెట్రో లగ్జరీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సు(Green Metro Luxery Electric AC Buses)ల్ని ప్రారంభించారు. ఎలక్ట్రిక్ బస్సులకు సబ్సిడీ లేనందున ప్రస్తుత బస్సులకు ఒక్క కిలోమీటర్‌కు రూ. 61లు చెల్లించడం జరుగుతుందన్నారు. దానివల్ల ఆర్థికంగా భారమవుతుందన్నారు.
TSRTC Electric Buses : త్వరలోనే భాగ్యనగరం రోడ్లపై.. ఎలక్ట్రిక్ బస్సులు రయ్ రయ్
Puvvada Ajay Kumar on Electric Buses : ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ యుగం నడుస్తున్నప్పటికీ, మన దేశంలో ఇంకా తక్కువగా ఉందన్నారు. వచ్చే తరాలకు వాయు కాలుష్యంలేని వాతావరణాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. టీఎస్ఆర్టీసీ పరిరక్షించుకోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడం శుభపరిణామని.. ఇది తన హయాంలో జరుగడం చాలా సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
"రాబోయే తరాలకి హైదరాబాద్‌ని కాలుష్యంలేని విధంగా అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించాం. టీఎస్ఆర్టీసీ కష్టాల్లో ఉన్న ప్రజలు కష్టాల్లో ఉండకూడదని ఆలోచించి ప్రజలకి ఈ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చాం. 550 బస్సులని హైదరాబాద్‌లో ప్రయాణం చేసేందుకు ఆర్డర్ చేశాం." -పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రి
-
హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు #TSRTC అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతలో 25 బస్సులను సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్… pic.twitter.com/OAG24JPywA
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు #TSRTC అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతలో 25 బస్సులను సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్… pic.twitter.com/OAG24JPywA
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 20, 2023హైదరాబాద్ లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు #TSRTC అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతలో 25 బస్సులను సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్… pic.twitter.com/OAG24JPywA
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 20, 2023
TSRTC MD Sajjanar on Electric Buses : మొదటిసారిగా హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెడుతున్నామని ఎండీ సజ్జన్నార్ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో ఐటీ సెక్టార్లో 470 బస్సులను తీసుకొస్తామన్నారు. బస్సుల్లో అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించామని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఫొటోలను తెలియజేస్తూ ట్వీటర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో కాలుష్యనివారణకు పర్యావరణహితమైన “ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ” ఏసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. మొత్తం 50 గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ సర్వీసుల్లో మొదటి విడతలో 25 బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందని వెల్లడించారు. ఈ నెల 23 నుంచి ఈ బస్సులు నగర ప్రయాణికులకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రైవేట్‌కు ధీటుగా టీఎస్‌ఆర్టీసీ పనిచేస్తోందన్నారు. ప్రతి రోజు దాదాపు 6 వేల మంది ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ స్పూర్తితోనే మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తేవాలని సంస్థ ప్లాన్ చేసిందని వివరించారు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సు(Electric Metro Buses)ల్లో ప్రయాణించి.. సంస్థను ఆదరించి, ప్రోత్సహించాలని కోరారు.
TSRTC AC Electric Buses Launch Today : హైదరాబాద్‌లో నేటి నుంచి గ్రీన్ మెట్రో బస్సులు రయ్రయ్
TSRTC Launched E-Buses : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 'ఈ-గరుడ' సేవలు అందుబాటులోకి వచ్చేశాయ్..