RTC Special busses for mahashivratri: రాష్ట్రంలోని శైవాలయాలు మహా శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. రేపే శివరాత్రి కావడంతో ఆలయాలు ముస్తాబయ్యాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ కూడా ప్రత్యేక సేవలను అందించడానికి సిద్ధమైంది. టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి వేములవాడ, శ్రీశైలం, కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు ప్రత్యేక బస్సు సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటు వేములవాడ చుట్టూ ఉన్న జిల్లాల నుంచి నుంచి కూడా ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. ఇక వేములవాడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 14 మినీ బస్సులను ఏర్పాటు చేశామని.. వీటిలో తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవస్థానం వరకు భక్తులు ఉచితంగా ప్రయాణించవచ్చునని ఆర్టీసీ వెల్లడించింది.
-
రాజన్న జాతరకు #TSRTCFreeBus ఉచిత బస్సు సదుపాయం కలదు. #Mahashivratri జాతరకు విచ్చేయుచున్నభక్తులకు స్వాగతం, సుస్వాగతం.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
14 mini buses has arranged on special hire to temple authorities for operating as free shuttles between our bus stand & temple for the convenience of devotees pic.twitter.com/fSIDw3Vvum
">రాజన్న జాతరకు #TSRTCFreeBus ఉచిత బస్సు సదుపాయం కలదు. #Mahashivratri జాతరకు విచ్చేయుచున్నభక్తులకు స్వాగతం, సుస్వాగతం.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 28, 2022
14 mini buses has arranged on special hire to temple authorities for operating as free shuttles between our bus stand & temple for the convenience of devotees pic.twitter.com/fSIDw3Vvumరాజన్న జాతరకు #TSRTCFreeBus ఉచిత బస్సు సదుపాయం కలదు. #Mahashivratri జాతరకు విచ్చేయుచున్నభక్తులకు స్వాగతం, సుస్వాగతం.
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) February 28, 2022
14 mini buses has arranged on special hire to temple authorities for operating as free shuttles between our bus stand & temple for the convenience of devotees pic.twitter.com/fSIDw3Vvum
ఆర్టీసీ స్పెషల్ సర్వీసెస్
రాష్ట్రంలో జరిగే వివిధ పండుగలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అందులో భాగంగా శివరాత్రి పర్వదినం సందర్బంగా శ్రీశైలం దేవస్థానానికి ఆర్టీసీ 155 ప్రత్యేక బస్సులను సిద్ధంచేసింది. ఈనెల 27 నుంచి వచ్చే నెల 2వ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని.. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న -20 బస్సులు, 28న- 57బస్సులు, మార్చి 1న- 59బస్సులు, మార్చి 2న- 19బస్సులను నడిపిస్తున్నామన్నారు. బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుఖ్ నగర్, ఐఎస్ సదన్ ప్రాంతాల నుంచి అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.
ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి ఛార్జీలు
- సూపర్ లగ్జరీ- రూ.510
- డీలక్స్ - రూ.450
- ఎక్స్ ప్రెస్ - రూ.400లు
నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి ఛార్జీలు
- సూపర్ లగ్జరీ - రూ.550
- డీలక్స్- రూ.480
- ఎక్స్ ప్రెస్ - రూ.430
సద్వినియోగం చేసుకోవాలి..
హైదరాబాద్ గ్రేటర్ ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి వచ్చే నెల 4 వరకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు హైదరాబాద్ గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడలకు ఈ ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు, తార్నాక, రెజిమెంటల్ బజార్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఘట్కేసర్, వెంకటాపురం, అల్వాల్, అమ్ముగూడ, బాలానగర్ క్రాస్ రోడ్, మియాపూర్ క్రాస్ రోడ్, పటాన్ చెరుతో పాటు ముఖ్యమైన ప్రదేశాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నామన్నారు. 30 మందితో కూడిన భక్తులు ఒక గ్రూపుగా ఏర్పడితే తమ నివాసానికి సమీప ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ ఈడీ వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక బస్సులు
ఈనెల 28 నుంచి మార్చి2 వరకు కరీంనగర్ రీజియన్ పరిధిలో మొత్తం 770 బస్సులను వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు నడిపిస్తున్నారు. జేబీఎస్, కొండగట్టు రూట్లో ఈనెల 28న-15 బస్సులు, మార్చి 1న-24 బస్సులు, మార్చి 2న-23 ఇలా మొత్తం 62 బస్సులను నడిపిస్తోంది. ఇక హైదరాబాద్ జేబీఎస్ నుంచి ప్రతి 20 నిమిషాలకు ఒక సాధారణ బస్సు ఉంటుందని... వాటిని యథావిధిగా నడుపుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.
వివిధ రూట్లలో బస్సులు..
- సిరిసిల్ల-వరంగల్ రూట్- 45 బస్సులు
- కోరుట్ల రూట్- 50 బస్సులు
- మెట్పల్లి రూట్- 110 బస్సులు
- కరీంనగర్ రూట్- 120 బస్సులు
- ఆర్మూర్ రూట్- 105 బస్సులు
- వరంగల్-నర్సంపేట్ రూట్ - 25 బస్సులు
- వరంగల్ రూట్ - 50 బస్సులు
- నిజామాబాద్ రూట్- 40 బస్సులు
- నిర్మల్ రూట్ - 100బస్సులు
- కామారెడ్డి రూట్ - 63 బస్సులు
ఉచిత బస్సులు
శివరాత్రి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వేములవాడకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఉచిత సర్వీసులను సైతం ఏర్పాటు చేసింది. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి దేవస్థానం వరకు 14 మినీ బస్సులను సిద్ధం చేసింది. వీటిని అందంగా అలంకరించింది. బస్సులపై శివుడు, శివలింగం, వేములవాడ దేవస్థానం ప్లెక్సీలను ఏర్పాటు చేసింది. భక్తులకు చూడగానే తెలిసేవిధంగా ఆ బస్సులపై ఉచిత సర్వీసులు అని కూడా రాశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కోరింది.
ఇదీ చదవండి: Vemulawada Rajanna temple : మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన రాజన్న ఆలయం