శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని రషీదుగూడలో అతి పెద్ద ఆర్టీసీ టెర్మినల్ కోసం 2017లో వందకోట్ల విలువైన 5ఎకరాల 32గుంటల భూమిని రెవెన్యూ శాఖ ఆర్టీసీకి కేటాయించింది. దీనికి అర్టీసీ అధికారులు ఆ భూముల చుట్టూ మార్కింగ్ చేసి దిమ్మెలు కూడా పాతారు. ఈ క్రమంలో కొందరు కబ్జాదారులు ఆర్టీసీకి చెందిన భూములపై కన్నెసి స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నారు. ఈ భూముల్లో అక్రమంగా గదులు నిర్మించి అక్రమించుకున్నారు.
ఈ విషయాన్ని ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఈ స్థలం ఆర్టీసీ సంస్థకు చెందిందని ఇతరులెవరైనా నిర్మాణాలు చేపడితే చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరంగా చర్యలు చేపట్టాలని స్థానిక పోలీసులకు చార్మినార్ డీజీఎం రాములు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి: జనవరి 8న రవాణా బంద్కు గోడప్రతుల ఆవిష్కరణ