TSPSC That No Mistakes in Group 1 Prelims Exam : ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు(TSPSC Group1 Prelims Cancel) చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని హైకోర్టు(Telangana High Court) టీఎస్పీఎస్సీకి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జూన్ 11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది. అప్పుడు నిర్వహించిన పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కమిషన్ తెలిపింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ(TSPSC) ఒక ప్రకటనను విడుదల చేసింది.
పరీక్ష రోజు కలెక్టర్ల సమాచారం ఆధారంగా ప్రకటన ఇచ్చామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది. ఇందులో 2,33,248 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు తెలిపామని వివరించింది. పారదర్శకత కోసం అదే విషయాన్ని మీడియాకు కూడా చెప్పడం జరిగిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఓఎంఆర్ స్కానింగ్‌లో 2,33,506 మంది పరీక్ష రాశారని తేలిందని కమిషన్ వివరణ ఇచ్చింది.
TSPSC Group 1 Prelims Exam Cancelled : గ్రూప్-1 ప్రిలిమ్స్ 33 జిల్లాల్లో 994 కేంద్రాల్లో నిర్వహించామని వ్యాఖ్యానించారు. అనేక జిల్లాల్లో లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారని.. అలా లక్షల్లో రాసినప్పుడు అంకెల్లో స్వల్ప మార్పులు సహజమేనని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
స్కానింగ్ తర్వాత తుది సంఖ్య ప్రకటించామని టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదని నొక్కి చెప్పింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగలేదని కమిషన్ స్పష్టం చేసింది. ఎంతో పారదర్శకంగా పరీక్షను నిర్వహించాలమని ప్రకటనలో వివరాలు వెల్లడించింది.
High Court Cancelled TSPSC Group1 Prelims Exam : టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను సింగిల్ బెంచ్ జడ్జి రద్దు చేయడం సబబేనని హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం స్పష్టం చేసింది. మళ్లీ పరీక్షను నిర్వహించాలని కమిషన్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదటిసారి నిర్వహించినప్పుడు పేపర్ లీకేజీ కారణంగా తొలుత రద్దు చేశారు. తర్వాత నిర్వహించినప్పుడైన తగిన జాగ్రత్తు తీసుకోవాల్సిందని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది.
అసలు బయో మెట్రిక్‌ను ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. ఒకసారి పరీక్ష రద్దైన తర్వాత కూడా తగిన జాగ్రత్తలు తీసుకోలేదని.. సింగిల్ బెంచ్ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసింది. ఈ తీర్పుపై సవాల్ చేస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ.. డివిజన్ బెంచ్ కమిషన్ అప్పీలును కొట్టేసింది.