TSPSC Paper Leakage Case: టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి వ్యక్తిగత సిబ్బందే.. రూ. 10లక్షలకు ఆశపడి దళారులతో కలిసి టౌన్ ఫ్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్ష పేపర్లను లీకేజీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ లీకేజీ వ్యవహారంలో పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. చివరికి టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడు ప్రవీణ్‌నే ఈ పేపర్ లీకేజీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రవీణ్‌తో పాటు.. ఇద్దరు దళారులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు విచారిస్తున్నారు. బేగంబజార్‌లోని పీఎస్‌కు టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్‌ను, ఇద్దరు నిందితులను తరలించారు. నిందితుడు ప్రవీణ్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకొని.. ఇంకా విలువైన సమాచారం ఉంటుందేమోనని ఎఫ్ఎస్ఎల్కు పోలీసులు పంపారు.
ముగ్గురు దళారులతో కలిసి ప్రవీణ్ పేపర్ లీకేజీకి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పేపర్ లీకేజీకి దళారులతో ఉన్నతాధికారి వ్యక్తిగత సిబ్బంది అయిన ప్రవీణ్ రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భావిస్తున్నారు. పనిగా ఆ ముగ్గురు దళారులకు టౌన్ ఫ్లానింగ్ పరీక్ష పత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ప్రవీణ్‌ను, మిగిలిన ముగ్గురు దళారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నపత్రాలు కొనుగోలు చేసిన పలువురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రశ్నపత్రం లీకైనట్లు ఓ అభ్యర్థి బేగంబజార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వెబ్‌సైట్‌ను పరీక్షించిన అధికారులు టీఎస్పీఎస్సీలో టౌన్ ఫ్లానింగ్ పేపర్ తస్కరణకు గురైనట్లు గమనించారు. వెంటనే వారు టౌన్ ఫ్లానింగ్, వెటర్నరీ రెండు పరీక్షలను వాయిదా వేశారు. ఈ లీకేజీ విషయంలో పోలీసులు ఇంకా లోతుగా విచారణ చేస్తున్నారు.
రెండు పరీక్షలు రద్దు: టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు హ్యాకింగ్ కలకలం సృష్టించింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ పోస్టుల భర్తీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నల సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్లు ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వెరిఫై చేసుకొని ప్రశ్నల సమాచారం లీకైందని వెల్లడించారు. వెంటనే ఈ ఆదివారం జరగాల్సిన టౌన్‌ప్లానింగ్.. ఈ నెల 15,16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు. ఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు అభ్యర్థులకే ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం చేరవేశామని అధికారులు తెలిపారు. వెంటనే ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: