ETV Bharat / state

TSPSC పరీక్షల రీషెడ్యూల్.. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న కమిషన్‌ - TSPSC Paper Leakage Case Latest News

TSPSC Intends to Re schedule Exams: త్వరలో జరగాల్సిన పలు పరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలని టీఎస్​పీఎస్సీ భావిస్తోంది. అయితే కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు యథాతథంగా నిర్వహించే అవకాశం ఉంది. అయితే వీటి సాధ్యాసాధ్యాలను టీఎస్​పీఎస్సీ పరిశీలిస్తోంది.

TSPSC
TSPSC
author img

By

Published : Mar 19, 2023, 7:04 AM IST

TSPSC Intends to Reschedule Exams: ప్రశ్నాపత్రాల లీకేజీతో పలు పరీక్షలను రీషెడ్యూలు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. వేటిని రీషెడ్యూలు చేసే అవకాశం ఉంది.. వేటిని యథాతథంగా కొనసాగించవచ్చన్న విషయమై కసరత్తు చేస్తోంది. అభ్యర్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యే పరీక్షలను వీలైనంత త్వరగా ముగించేలా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో, ఏఈ పరీక్షలను కమిషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే.

రెండు నెలల ముందుగా ప్రశ్నాపత్రాల తయారీ: ఈ నెలలో జరగాల్సిన టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల పరీక్షలను టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. ఏప్రిల్‌, మేలో జరగాల్సిన పరీక్షల తేదీలూ రీ షెడ్యూలయ్యే అవకాశముంది. ఈ క్రమంలోనే రద్దు చేసిన, వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించి నెలాఖరులోగా తేదీలను ప్రకటించే అవకాశమున్నట్లు తెలిసింది. సాధారణంగా ఏదైనా పోటీ పరీక్షకు రెండు నెలల ముందుగా ప్రశ్నాపత్రాలు సిద్ధమవుతాయి. రానున్న రెండు నెలల్లో జరగాల్సిన పరీక్షలకు ప్రశ్నాపత్రాలను సిద్ధం చేయడానికి కొంత సమయం పట్టనుంది.

కనీసం 3 నెలల సమయం అవసరం: 40,000 మంది కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు హాజరయ్యే పోటీ పరీక్షలను కమిషన్‌ ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తోంది. అంతకు తక్కువగా ఉంటే కంప్యూటర్‌ ఆధారితంగా పరీక్షలు పెడుతోంది. కానీ ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించేందుకు.. కనీసం 3 నెలల సమయం అవసరం. ప్రశ్నాపత్రం సిద్ధం చేసి, ముద్రించి.. పరీక్ష కేంద్రాల వరకు సరఫరా చేయడానికి సమయం పడుతుంది. ఈ క్రమంలోనే కొన్ని పోటీ పరీక్షలకు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ముగిసింది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది: దీంతో తక్కువ సంఖ్యలో అభ్యర్థులున్న వాటికి.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వాటిని వేగంగా నిర్వహించడంతో పాటు.. ఫలితాలనూ వెంటనే ఇచ్చేందుకు అవకాశం ఉందని కమిషన్‌ వర్గాలు భావిస్తున్నాయి. షెడ్యూలు ప్రకారం జూన్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. అదే నెలలో యూపీఎస్సీ, జేఈఈ పరీక్షలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది.

అనుకున్న సమయానికే నిర్వహించాలా?: ఇప్పటికే గ్రూప్‌-4, 2 పరీక్షల తేదీలను ప్రకటించింది. వీటిని అనుకున్న సమయానికే నిర్వహించాలా? అనే విషయమై కమిషన్ ఆలోచిస్తోంది. తొలుత గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది. జులై 1వ తేదీన గ్రూప్‌-4, ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్షలు జరగనున్నాయి. ఈ మూడింటినీ వరుసగా నిర్వహిస్తే.. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతాయా? సిద్ధమయ్యేందుకు సమయం సరిపోతుందా? అనే విషయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయించే అవకాశముంది.

ఇవీ చదవండి: టీఎస్​పీఎస్సీలో ఐపీ అడ్రస్‌లను మార్చి పేపర్లు కొట్టేశారు..

'దేశంలో ప్రజాస్వామ్యం పటిష్ఠం.. ఓర్వలేకే వారి దాడులు! అయినా ఆగేదే లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.