ETV Bharat / state

TSPSC పేపర్​ లీకేజీ.. ఇంటి దొంగల పనే..!

TSPSC Exam Paper Leak Latest Updates: టీఎస్​పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారం ఇంటి దొంగల పనేనని పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్‌లో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్‌తో పాటు సహకరించిన పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్‌ సహా 13 మందిని బేగంబజార్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్​ఓగా ఉన్న ప్రవీణ్‌కు ఓ మహిళా ప్రభుత్వ ఉపాద్యాయురాలు పరిచయం కాగా.. డబ్బుకోసం ఆమెకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. పశ్నాపత్రం అమ్ముకునే క్రమంలో ఓ అభ్యర్థి పోలీసులకు ఇచ్చిన సమాచారంతో ఈ వ్యవహరం బయటపడింది.

tspsc
tspsc
author img

By

Published : Mar 13, 2023, 7:03 AM IST

టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ.. ఇంటి దొంగల పనే

TSPSC Exam Paper Leak Latest Updates: టీఎస్​పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంలో పోలీసులు దర్యప్తు ముమ్మరం చేశారు. అసలు లీక్ ఏ విధంగా జరిగిందనే విషయంపై అరా తీసిన పోలీసులు.. కేసుతో సంబంధం ఉన్న 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. కమిషన్‌లో ప్రశ్నాపత్రం నేరుగా లీక్ అయ్యే అవకాశాలు లేకపోవడంతో.. కార్యాలయంలో అత్యంత రహస్యంగా నిర్వహించే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్లలోని ప్రశ్నల సాఫ్ట్ కాపీ సమాచారాన్ని దొంగలించిట్లు పోలీసులు గుర్తించారు.

టీఎస్​పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్న ఏఎస్​ఓ ప్రవీణ్, పొరుగుసేవల ఉద్యోగి రాజశేఖర్‌తో కలిసి ప్రశ్నాపత్రాలు లీక్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. అయితే టీఎస్​పీఎస్సీలో ఇటీవల కంప్యూటర్లను అప్‌గ్రేడ్‌ చేశారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సమాచారం.. కార్యదర్శి సంబంధిత సెక్షన్ వద్ద ఉంటుంది. అప్‌గ్రేడ్‌ చేసిన సమయంలో టీఎస్​పీఎస్సీలో పనిచేస్తున్న.. టీసీఎస్ పొరుగు సేవల ఉద్యోగి రాజశేఖర్‌ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తస్కరించినట్లు అనుమానిస్తున్నారు. కంప్యూటర్లు ఆప్‌గ్రేడ్ చేసినప్పుడు ప్రయత్నం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సమాచారాన్ని ప్రవీణ్‌కు ఇచ్చాడని పోలీసులు గుర్తించారు.

కీలక అంశాలు వెలుగులోకి: కేసు దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రవీణ్‌కు పరిచయం ఉన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి కోసమే పేపర్ లీక్ చేసినట్లు పోలీసులు విచారణలో తేలింది. అమెతో ప్రవీణ్‌కు పాత పరిచయం ఉన్నట్లు గుర్తించారు. ఆమె పలు మార్లు టీఎస్​పీఎస్సీ కార్యదర్శి కార్యాలయంలో ప్రవీణ్‌తో పాటు ఎక్కువసేపు కూర్చున్నట్లు తెలిసింది. సాధారణంగా ఆ కార్యాలయంలో అనుమతి లేనిదే ఇతరులను అనుమతించరు.

ఆమె చెప్పిన డీల్‌ కోసం.. పేపర్ లీక్ చేసిన ప్రవీణ్‌: ఎవరిని కలవాలో ముందుగా సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి.. ఆ అధికారి నుంచి అనుమతి తీసుకుంటారు. వచ్చిన వారి పూర్తి వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ ఆ మహిళ.. కార్యదర్శి పీఏ ప్రవీణ్‌ను కలిసేందుకు తరుచూ రావడం.. కార్యాలయం నుంచి పోలీసులకు కార్యదర్శి పీఏగా ప్రవీణ్ అనుమతిని ఇవ్వడంతో ఎక్కువగా వచ్చినట్లు తెలిసింది. ఇదే క్రమంలో ఆమె చెప్పిన డీల్‌ కోసం ప్రవీణ్‌.. పేపర్‌ను లీక్ చేశారన్న వివరాలు పోలీసులు సేకరించారు. అది కూడా ఎక్కువ మందికి ప్రశ్నలు లీక్ చేస్తే.. చేసిన తప్పులు బయటపడుతాయన్న ఉద్దేశంతో వారు పకడ్బందీగా వ్యవహరించారని తెలిపారు.

బేరసారాలు నడిపిన ఉపాధ్యాయురాలు: ముఖ్యంగా ఉపాధ్యాయురాలు .. తన సోదరుడి కోసం టౌన్​ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్​సీర్ ప్రశ్నాపత్రం కావాలంటూ ప్రవీణ్‌పై ఒత్తిడి తీసుకువచ్చింది. ప్రశ్నాపత్రం దొరికే అవకాశం ఉండటంతో ఆమె పరీక్ష రాసేందుకు సిద్ధమైన అభ్యర్థి.. ఒక గ్రామ సర్పంచి కుమారుడితో బేరసారాలు నడిపింది. నలుగురు అభ్యర్థుల నుంచి రూ.14 లక్షలు వసూలు చేసింది. ఇందులో రూ.10 లక్షలు ప్రవీణ్​కు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

ఈ విషయం తెలిసిన ఓ అభ్యర్థి.. డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు టీఎస్​పీఎస్సీ అధికారులతో సంప్రదించగా.. పేపర్‌ లీకైన వ్యవహారం బయటపడింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన కార్యదర్శి పీఏ ప్రవీణ్.. కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులయ్యారు. అనంతరం పదోన్నతి లభించింది. గతంలో పనిచేసిన ప్రభుత్వ విభాగాన్ని మూసివేయడంతో టీఎస్​పీఎస్సీకి వచ్చారు. నాలుగేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నారు.

ఇటీవల టీఎస్​పీఎస్సీ నుంచి పలు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. నిందితులు ఈ పరీక్షా పత్రాలేనా.. లేక గతంలో జరిగిన సీడీపీఓ, సూపర్​వైజర్ ఇతర పోస్టులకు పేపరు లీక్ చేశారా అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ప్రవీణ్‌ ల్యాప్‌టాప్‌ను జప్తు చేసి ఫోరెన్సిక్​ ల్యాబ్​కు పంపారు.

ఇవీ చదవండి: రూ.10లక్షలకు ఆశపడి.. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ

TSPSC పేపర్​ లీకేజీ ఘటన.. 13మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ED, CBI దాడులే ప్రతిపక్షాల టార్గెట్​.. ప్రారంభం కానున్న పార్లమెంట్​ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.