ETV Bharat / state

TSPSC Aspirants Confusion : గ్రూప్-1 చదవాలా.. గ్రూప్-2కు ప్రిపేర్ అవ్వాలా.. అయోమయంలో అభ్యర్థులు

TSPSC Aspirants Confusion on Groups Preparation : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పేపర్​ లీకేజీలు, పరీక్షల రద్దుతో.. నిరుద్యోగుల పరిస్థితి గందరగోళంగా మారింది. గ్రూప్​-1 ప్రధాన పరీక్షకు ప్రిపేర్​ అవుతున్న తరుణంలో రెండోసారి పరీక్ష రద్దుతో.. ఇన్నాళ్లుగా పడిన తమ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని అభ్యర్థులు వాపోతున్నారు. ఆ ప్రయత్నాన్ని విరమించి నెల రోజుల్లో జరిగే గ్రూప్‌-2 పరీక్షకు ప్రిపరేషన్​ కావాలంటే సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Group 1 Exam Latest Information
TSPSC Aspirants Confusion on Groups Preparation
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 27, 2023, 2:53 PM IST

TSPSC Aspirants Confusion on Groups Preparation : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పోటీ పరీక్షల నిర్వహణలో.. టీఎస్‌పీఎస్సీ పొరపాట్లతో నిరుద్యోగ అభ్యర్థుల్లో గందరగోళంగా చెలరేగింది. వివిధ ప్రశ్నపత్రాల లీకేజీతో అభ్యర్ధుల పరిస్థితి అయోమయంగా మారింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహణపై నెలకొన్న తాజా పరిణామాలతో.. నవంబరులో జరిగే గ్రూప్‌-2 పరీక్షకు సన్నద్ధతపై అభ్యర్థుల్లో సందిగ్ధత నెలకొంది. జూన్​ 11న రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ ప్రకారం.. మార్కులు అంచనా వేసుకున్న పలువురు అభ్యర్థులు మెయిన్స్​ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు.

Group 1 Exam Latest Information : అందులో మార్కులు తక్కువగా వస్తాయని భావించినవారు.. వచ్చే నవంబర్​లో నిర్వహించబోయే గ్రూప్‌-2పై దృష్టి సారించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో గ్రూప్‌-1, గ్రూప్‌-2లలో దేనిపై దృష్టి సారించాలనే విషయమై అయోమయం నెలకొంది. మరోవైపు, గ్రూప్‌-1 మినహాయించి.. పరీక్షలు నిర్వహించిన నోటిఫికేషన్లకు అభ్యర్థుల ప్రతిభ ఆధారితంగా జనరల్‌ ర్యాంకు జాబితాలను విడుదల చేసేందుకు టీఎస్‌పీఎస్సీ ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

TSPSC Latest News : రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్‌-1 పరీక్షకు 3.8 లక్షల మంది దరఖాస్తు చేశారు. వీరిలో 90 శాతానికిపైగా అభ్యర్థులు గ్రూప్‌-2 నోటిఫికేషన్​కు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్‌-2కు మొత్తంగా 5.51 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మొదటగా కమిషన్​ ఇచ్చిన నోటిఫికేషన్​లో గ్రూప్‌-2 పరీక్షలను ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించేందుకు టీఎస్​పీఎస్సీ షెడ్యూలు జారీ చేసింది. గత సంవత్సరం అక్టోబర్​లో నిర్వహించిన గ్రూప్​-1 ప్రిలిమ్స్​ పరీక్ష.. ప్రశ్నపత్రాల లీకేజీతో రద్దయింది. మరలా ఈ పరీక్షను రెండోసారి జూన్​11న నిర్వహించారు.

Group 1 Prelims Exam Cancelled Telangana : 'గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో TSPSC అజాగ్రత్తగా ఉంది.. ప్రిలిమ్స్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించండి'

జులై 1న గ్రూప్‌-4 పరీక్ష జరిగింది. ప్రశ్నపత్రాల లీకేజీ, వరుస పరీక్షలతో తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యామని, గ్రూప్‌-2 పరీక్ష ప్రిపరేషన్​కు సమయం సరిపోదని, దాన్ని వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. దీంతో గ్రూప్​-2 పరీక్షను నవంబరు 2, 3 తేదీలకు టీఎస్​పీఎస్సీ వాయిదా వేసింది. దానికి సన్నద్ధమవుతున్న సమయంలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు అభ్యర్థులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటివరకు గ్రూప్‌-1 ప్రధాన పరీక్షపై దృష్టి పెట్టిన అభ్యర్థులు.. ఆ ప్రయత్నాన్ని విరమించి నెల రోజుల్లో జరిగే గ్రూప్‌-2 పరీక్షకు ప్రిపరేషన్​ కావాలంటే సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీఎస్‌పీఎస్సీ ఇప్పటివరకు 19 ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేసి.. రాతపరీక్షలు నిర్వహించింది. అయితే ప్రధానమైన గ్రూప్‌-1, గ్రూప్‌-2లు.. పేపర్ ​లీకేజీలు, కోర్టు తీర్పులతో ఇంకా పూర్తికాలేదు. గ్రూప్‌-4 పరీక్ష జరిగినప్పటికీ తుది కీ వెల్లడించలేదు. గ్రూప్‌-3, హాస్టర్​ వెల్ఫేర్​ ఆఫీసర్​, డీఏవో పోస్టుల భర్తీకి ఇంకా రాతపరీక్షల తేదీలు ఖరారు కాలేదు. గ్రూప్‌-4తో పాటు ఇప్పటివరకు ఆటంకం లేకుండా పరీక్షలు జరిగిన నోటిఫికేషన్లకు.. ఒక్కొక్కటిగా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జాబితా విడుదల చేయాలని, మెరిట్‌ ర్యాంకులు ప్రకటించాలని కమిషన్‌ నిర్ణయించింది.

ఇప్పటికే అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు పోస్టులకు జనరల్‌ ర్యాంకుల జాబితాలు విడుదల చేసింది. కోర్టు కేసుల్లో ఉన్న నోటిఫికేషన్లను పక్కనపెట్టి.. మిగతావాటికి మెరిట్​ జాబితాల వెల్లడికి ప్రణాళిక పూర్తి చేసింది. ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తరువాత 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి ధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం.. తుది నియామక కార్యాచరణ మొదలుపెట్టాలని భావిస్తోంది.

TSPSC appeal against Group-1 Exam cancellation : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దుపై అప్పీలుకు వెళ్లిన టీఎస్‌పీఎస్సీ

Bandi Sanjay On Group1 Exam Cancellation : 'గ్రూప్-1 రాసిన ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.