ETV Bharat / state

రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడిపై టీఎస్‌న్యాబ్‌ ఫోకస్ - బ్రీత్ ఎనలైజర్ తరహా కిట్లతో తనిఖీలకు సమాయత్తం - TS NAB action on drugs in Telangana

TSNAB Focus on Drugs Control in Telangana : రాష్ట్రంలో మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేకంగా ఏర్పాటైన, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తీవ్రంగా కృషి చేస్తోంది. ఇందుకోసం వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అసరమైన వనరులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. డైరెక్టర్‌గా నియమితులైన సందీప్ శాండిల్య సైతం టీఎస్‌న్యాబ్‌కు ఎలాంటి నిబంధనలు ఉండకూడదని, గ్రే హౌండ్స్, ఆక్టోపస్‌లా స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని కోరారు. త్వరలో టీఎస్‌న్యాబ్‌, తాగి వాహనాలు నడిపే వారి కోసం ఉపయోగించే బ్రీత్ ఎనలైజర్ తరహా కిట్లతో డ్రగ్స్ సేవించిన వారి భరతం పడతామంటోంది. మత్తు పదార్థాలు సరఫరా చేస్తే రెండేళ్లపాటు జైల్లోనే ఉండేలా చర్యలు తీసుకుంటామన్న ఆయన, అవి వినియోగిస్తున్న వారికి హెచ్చరికలు జారీ చేశారు.

TS NAB
TS NAB
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 10:27 AM IST

రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడిపై టీఎస్‌ న్యాబ్‌ ఫోకస్

TSNAB Focus on Drugs Control in Telangana : మాదకద్రవ్యాల నిర్మూలనకు ఏర్పాటైన టీఎస్‌న్యాబ్, పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తోంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ముందున్న సవాళ్లు, యువత- సమాజంపై డ్రగ్స్ చూపుతున్న చెడు ప్రభావాన్ని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎదుట వివరించినట్లు సంస్థ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. మత్తు పదార్థాల రహిత రాష్ట్రంగా మారేందుకు చేపట్టాల్సిన చర్యలను, లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Sandeep Shandilya on Drugs Control in Telangana : టీఎస్‌న్యాబ్‌లో సిబ్బంది కొరత లేకుండా చూడాలని ముఖ్యమంత్రిని కోరినట్లు సందీప్ శాండిల్య (TSNAB Director Sandeep Shandilya) వివరించారు. ఎలాంటి నిబంధనలు ఉండకుండా, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ వలే ప్రధాన సంస్థగా మార్చాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఇతర సంస్థలతో పాటుగా టీఎస్‌న్యాబ్‌లో పనిచేసేవారికి వేతన పెంపు, పదోన్నతుల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎంను కోరానని, దీనిపై ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సందీప్ శాండిల్య తెలిపారు.

మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం.. నిరోధానికి మరింత పకడ్బందీ చర్యలు

Anti Drug Committees in Telangana : టీఎస్‌న్యాబ్ (TS NAB) ప్రధానంగా విద్యాసంస్థలు, ఐటీ, చిత్రపరిశ్రమ, బార్స్, పబ్స్, రేవ్ పార్టీలు, రిసార్ట్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిందని సందీప్ శాండిల్య తెలిపారు. పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, పోలీసులు చూడకపోతే ఇంకెవరు చూస్తారని అన్నారు. ప్రతి ఒక్కరు విధిగా మాదకద్రవ్యాల మహమ్మారిపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల ప్రిన్సిపళ్లు, అధ్యాపకులు కనీసం ఐదుగురితో కలిసి యాంటీ డ్రగ్ కమిటీలుగా (Anti Drug Committees in Telangana) ఏర్పడాలని సందీప్ శాండిల్య సూచించారు.

విద్యాసంస్థల యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందే : ఈ కమిటీలు డ్రగ్స్ సరఫరా, నియంత్రణపై దృష్టితో పాటు అవగాహన కల్పించాలని సందీప్ శాండిల్య అన్నారు . ఎవరైనా మత్తు పదార్థాలు సేవించినట్లు, సరఫరా చేసినట్లు తెలిస్తే వెంటనే, ఈ కమిటీలు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వివరించారు. విద్యాసంస్థల సమీపంలో మాదకద్రవ్యాల సరఫరాపై, యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందేనని సందీప్ శాండిల్య తేల్చి చెప్పారు.

Hyderabad customs police destroy drugs : 'రూ.950 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం చేశారు'

బ్రీత్ ఎనలైజర్ తరహా కిట్లతో తనిఖీలకు సమాయత్తం : ఎటుంవంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా రేవ్ పార్టీకి హాజరై డ్రగ్స్ సేవిస్తే, బ్రీత్ ఎనలైజర్ వంటి కిట్లతో సులభంగా నిందితులను పట్టుకోవచ్చని తెలిపారు. డ్రగ్స్ రవాణాకు అవకాశం ఉన్న ట్రాన్స్‌పోర్ట్‌, కొరియర్ సర్వీసులతో పాటు సామాజిక మాధ్యమాలపై ప్రత్యేక నిఘా పెట్టామని సందీప్ శాండిల్య వెల్లడించారు.

రెండు సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా చర్యలు : ప్రిస్క్రిప్షన్ లేకుండా ఔషధ దుకాణాల్లో మందులను విక్రయిస్తున్నారని సందీప్ శాండిల్య చెప్పారు. కొన్ని ఫ్యాక్టరీ ప్రాంగణాలను మందుల తయారీకి ఉపయోగిస్తున్నారని తమకు సమాచారం ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమన్నారు. మాదకద్రవ్యాలు సరఫరా చేసిన వ్యక్తిపై రెండు కేసులు నమోదైతే, రెండు సంవత్సరాల పాటు బెయిల్ రాకుండా చర్యలు తీసుకుంటామని సందీప్‌ శాండిల్య హెచ్చరించారు.

డార్క్‌ నెట్ డీల్స్​కు చెక్.. టెక్నాలజీ సాయంతో ముకుతాడు వేస్తున్న నార్కోటిక్ వింగ్

Telangana Narcotics Bureau(TNAB) : 'అవగాహనతోనే యువతను డ్రగ్స్​కు దూరంగా ఉంచగలం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.