ETV Bharat / state

ఈనెల 26న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్ ఎస్సై టెక్నికల్ పరీక్ష.. అవి తప్పనిసరి - ఈనెల 26న పోలీస్​ట్రాన్స్‌పోర్ట్‌ఆఫీసర్ఎస్సై పరీక్ష

TSLPRB Conduct PTO Exam on 26th March : ఈనెల 26న పోలీస్ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్ (పీటీవో) ఎస్సై టెక్నికల్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్​ఎల్​పీఆర్​బీ ప్రకటించింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పీటీవో పరీక్ష జరగనున్నట్లు తెలిపింది. ఈ నెల 21 నుంచి 24 వరకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

TSLPRB
TSLPRB
author img

By

Published : Mar 19, 2023, 7:13 PM IST

TSLPRB Conduct PTO Exam on 26th March : తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి(టీఎస్​ఎల్​పీఆర్​బీ) పోలీసు ట్రాన్స్​ఫోర్ట్ ఆఫీసర్(పీటీవో) టెక్నికల్ ఎస్సై ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది పరీక్షను ఈనెల 26న నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ నెల 21 ఉదయం 8గంటల నుంచి 24వ తేది అర్ధరాత్రి వరకు హాల్ టికెట్లను రిక్రూట్​మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్​లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్ధులు తమ హాల్ టికెట్లపై వారి ఫొటోను అతికించి పరీక్షకు హాజరు కావాలని సూచించింది.

మరోవైపు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ నేతృత్వంలో ఈ నెల 17, 18 తేదీల్లో జరగాల్సిన కానిస్టేబుల్‌(డ్రైవర్‌) పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. వాటిని మార్చి 23, 24 తేదీలలో నిర్వహించనున్నట్లు తెలిపింది. పోలీసు రవాణా సంస్థ(పీటీవో)లో డ్రైవర్లు, అగ్నిమాపక శాఖలో డ్రైవర్‌ ఆపరేటర్ల ఎంపిక కోసం డ్రైవింగ్‌ టెస్టులు నిర్వహించాల్సి ఉందని బోర్డు పేర్కొంది. ఈ నెల 16న కురిసిన భారీ వర్షం కారణంగా టెస్టులు నిర్వహించడం కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వర్షాలు పడతాయనే అంచనా నేపథ్యంలో వారం రోజులపాటు వాయిదా వేయాలని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఈ విధమైన నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షా అభ్యర్థులు మళ్లీ తమ అడ్మిట్‌కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదని నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.

రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీఎస్​ఎల్​పీఆర్​బీ నిర్వహించే తుది పరీక్షల షెడ్యూల్ వచ్చిన విషయం తెలిసిందే. తుది పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్ల జారీ ఆయా పరీక్షల తేదీలకు వారం ముందు నియామక మండలి ప్రకటించనుంది.

పోలీసు తుది పరీక్షల షెడ్యూల్‌..

మార్చి 26:

* ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పోలీస్‌ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్‌లో ఎస్సై పోస్టులకు టెక్నికల్‌ పేపర్‌ పరీక్ష జరగనుంది.

ఏప్రిల్‌ 2 :

* ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ డ్రైవర్లు, డ్రైవర్‌ ఆపరేటర్లు(కానిస్టేబుల్స్‌) పరీక్షకు టెక్నికల్‌ పేపర్‌ పరీక్ష హైదరాబాద్ కేంద్రంగా బోర్డు నిర్వహించనుంది.

* అదే విధంగా మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ మెకానికల్‌ (కానిస్టేబుల్‌) పోస్టులకు టెక్నికల్‌ పేపర్‌ పరీక్ష జరగనుంది.

ఏప్రిల్‌ 8 :

* ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సివిల్, ఐటీ, ఫింగర్‌ ప్రింట్స్‌ వంటి అన్ని విభాగాల్లోని ఎస్సై, ఏఎస్సై పోస్టులకు అర్థమెటిక్, టెస్టాఫ్‌ రీజనింగ్, మెంటల్‌ ఎబిలిటీలో పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్​ఎల్​పీఆర్​బీ పేర్కొంది.

* మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ అన్ని విభాగాల్లోని ఎస్సై, ఏఎస్సై పోస్టులకు ఇంగ్లిష్‌ భాషపై పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.

ఏప్రిల్‌ 9:

* ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ సివిల్‌తో పాటు ఇతర అన్ని విభాగాల ఎస్సై స్థాయి పోస్టులకు జనరల్‌ స్టడీస్‌ పరీక్ష జరగనుంది.

* మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ సివిల్‌తో పాటు ఇతర అన్ని విభాగాల్లో ఎస్సై స్థాయి పోస్టులకు తెలుగు, ఉర్దూ భాషలపై పరీక్ష నిర్వహిస్తారు.

ఏప్రిల్‌ 30:

* ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ సివిల్, రవాణా, ఆబ్కారీ శాఖలతో పాటు ఇతర అన్ని విభాగాల్లోని కానిస్టేబుల్‌ స్థాయి పోస్టులకు జనరల్‌ స్టడీస్‌లో పరీక్ష నిర్వహించనుంది. ఉమ్మడి 10 జిల్లాల కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

* మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్స్‌ విభాగం కానిస్టేబుల్‌ పోస్టులకు టెక్నికల్‌ పేపర్‌ పరీక్ష ఉంటుందని బోర్డు వెల్లడించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.