ETV Bharat / state

TSRTC CARGO: హైదరాబాద్​ నుంచి నేరుగా విశాఖకు టీఎస్​ఆర్టీసీ కార్గో సేవలు - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్​ నుంచి ఏపీలోని ప్రధాన వ్యాపార కేంద్రాలైన విజయవాడ, విశాఖకు కార్గో సర్వీసులు ప్రారంభమయ్యాయి. 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో వాహనాలను ఇందుకోసం అందుబాటులో ఉంచినట్లు.. కార్గో విభాగం ప్రత్యేక అధికారి ఎస్​. కృష్ణకాంత్‌ తెలిపారు.

ts rtc cargo
ts rtc cargo
author img

By

Published : Jul 15, 2021, 8:40 PM IST

తెలంగాణ ఆర్టీసీ.. కార్గో సేవల్లో ఒక్కో అడుగు ముందుకేస్తోంది. విస్తరణలో భాగంగా సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నామని.. కార్గో విభాగం ప్రత్యేకాధికారి ఎస్​. కృష్ణకాంత్​ వెల్లడించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్​లో కార్గో సేవల విస్తరణకు కార్యాచరణ అమలుచేస్తున్నట్లు చెప్పారు.

ఇందులో భాగంగా హైదరాబాద్​ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి నేరుగా ఏపీలోని విశాఖపట్టణానికి కార్గో సేవల్ని ప్రారంభించామన్నారు. హైదరాబాద్​లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్​పోర్టు మీదుగా వ్యాపార కేంద్రాలైన విజయవాడ, విశాఖపట్టణాలకు.. నిత్యం నేరుగా కార్గో సర్వీసులను నడుపుతున్నట్లు ఎస్​. కృష్ణకాంత్​ తెలిపారు.

10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో వాహనాలు... పటాన్​చెరు, మెహదీపట్నం, లక్డీకాపూల్​, సీబీఎస్​ నుంచి అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్​లో బయలుదేరిన కార్గో సర్వీసులు.. కనెక్టడ్​ పాయింట్లు.. కోదాడ, సూర్యాపేట, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం, తుని మీదుగా విశాఖపట్టణం చేరుకుంటాయని పేర్కొన్నారు.

ఇల్లు మారుతున్నప్పుడు, గృహ నిర్మాణం, పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు, ఫర్నీచర్​తో పాటు ఇతరత్రా సామగ్రి తరలించేందుకు ఈ ప్రత్యేక కార్గో సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. దూరం, వస్తు పరిమాణం బట్టి నిర్దిష్టమైన ధరలను నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పూర్తి సమాచారం కోసం https://www.tsrtc.telangana.gov.in వెబ్​సైట్​ను చూడవచ్చన్నారు.

ఇదీచూడండి: kokapet lands : భారీ ధర పలికిన కోకాపేట భూములు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.