కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల టెండర్లపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒకే కంపెనీకి టెండరు దక్కేలా నిబంధనలు రూపొందించారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ విషయంపై హైకోర్టులో లాన్ ఈ గవర్నెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ప్రై.లి. పిటిషన్ వేసింది. మదర్ హార్లిక్స్ తయారీ సంస్థకు టెండరు దక్కేలా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం, టీఎస్ఎంఐడీసీ, హిందుస్థాన్ యునిలీవర్ ప్రై.లి.ను ప్రతివాదులుగా పిటిషనర్ పేర్కొన్నారు.
తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు టెండర్లపై తుది నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల టెండరు ప్రక్రియ కొనసాగించవచ్చని హైకోర్టు తెలిపింది. దీనిపై పూర్తి వివరణ ఇవ్వాలని ప్రభుత్వం, టీఎస్ఎంఐడీసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇవీ చూడండి:
జక్కన్న- మహేశ్ సినిమా.. రంగంలోకి హాలీవుడ్ స్టార్.. రెమ్యునరేషన్ రూ.160 కోట్లా?
విదేశాల్లో 'చెన్నకేశవరెడ్డి' హంగామా.. పవన్, మహేశ్ కలెక్షన్ రికార్డులు బ్రేక్!