హైకోర్టులో పొట్లూరి వరప్రసాద్‌కు స్వల్ప ఊరట లభించింది. పీవీపీ ముందస్తు బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంపై పోలీసులకు నోటీసులిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు పీవీపీని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.
బంజారాహిల్స్ పీఎస్‌లో తనపై నమోదైన కేసులో పీవీపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు. విల్లా గొడవలో పీవీపీపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలని పీవీపీకి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల విచారణకు హాజరుకాకుండా పీవీపీ హైకోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణను జులై 27కు హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: డ్రాగన్‌తో ఢీ అంటే 'టీ'.. యుద్ధ ట్యాంకర్లు మోహరించిన భారత్