ETV Bharat / state

ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు... హెల్త్​ ప్రొఫైల్

ఆర్యోగ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి విస్తృత చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు తెలిపారు. బడ్జెట్​లో వైద్య రంగానికి రూ.6,186 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.

ts health deportment  budget 2020
ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు... హెల్త్​ ప్రొఫైల్
author img

By

Published : Mar 8, 2020, 4:03 PM IST

Updated : Mar 8, 2020, 5:44 PM IST

ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు... హెల్త్​ ప్రొఫైల్

ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తెలంగాణ హెల్త్​ ప్రొఫైల్​ను రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. ప్రజా వైద్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ ఏడాది బడ్జెట్​లో రూ.6,186 కోట్లు కేటాయించారు.

అత్యుత్తమ వైద్య సేవల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో నిలిచినట్లు నీతి ఆయోగ్​ నివేదికలో వెల్లడించిందని అన్నారు. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధమైన వ్యాధుల నిర్ధరణ కోసం ప్రత్యేక కార్యాచరణను ప్రారంభించనున్నామని వెల్లడించారు.

ts health deportment  budget 2020
ప్రతీ పౌరుడికి వైద్య పరీక్షలు... హెల్త్​ ప్రొఫైల్

హైదరాబాద్​ నగరంలో పేదలకు వైద్య సేవలు అందిస్తున్న 118 బస్తీ దవాఖానాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నందున నగరంలో ఈ దవాఖానాల సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, పేదలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాల్లో అదనంగా వీటిని ఏర్పాటు చేయనుంది.

ఇదీ చదవండి: తెలంగాణ బడ్జెట్‌.. రూ.1,82,914 కోట్లు

Last Updated : Mar 8, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.