కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి 337.50 కోట్ల రూపాయలను బీసీ సంక్షేమశాఖ విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.
ఈ ఏడాది ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకానికి బడ్జెట్ నుంచి 675 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా 337.50 కోట్లు విడుదల చేయగా... నాలుగో త్రైమాసికానికి సంబంధించిన మరో 337.50 కోట్ల కేటాయింపులు ఉన్నాయి.
- ఇదీ చదవండి: రైతన్న ఆక్రోశం.. దోమ సోకిన పంటకు నిప్పు