TS government has announced Rs 2 crore for Nikhat Zareen and Isha Singh: అంతర్జాతీయ క్రీడల్లో ఘన విజయం సాధించి.. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్, ఇషాసింగ్‌లకు రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఇద్దరికీ రెండు కోట్ల రూపాయల చొప్పున నగదు బహుమతితో పాటు ఇంటిస్థలాన్ని కూడా ఇవ్వనుంది. ఇటీవల టర్కీలో జరిగిన అంతర్జాతీయ మహిళా బాక్సింగ్ పోటీల్లో నిఖత్ జరీన్ స్వర్ణపతకం సాధించగా... జర్మనీలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్ షూటింగ్ పోటీల్లో ఇషాసింగ్ స్వర్ణపతకం సాధించింది.
గొప్ప విజయం సాధించిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఒక్కొక్కరికి రెండు కోట్ల నగదు బహుమతి ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. నగదు బహుమతితో పాటు బంజారాహిల్స్ లేదా జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
TS government has announced Rs 1 crore for kinnera Mogilaiah : జూన్ 2న రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా ఇద్దరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్‌లు అందించనున్నారు. అటు పద్మశ్రీ కిన్నెరమెట్ల మొగిలయ్యకు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన కోటి రూపాయల నగదు పురస్కారానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొగిలయ్య కోరుకున్న విధంగా బీఎన్ రెడ్డి నగర్ కాలనీలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ చూడండి: