Harish Rao Speech at NIMS Hospital : తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరవాత నిమ్స్‌లో సౌకర్యాలు పెరిగాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మరో 10 రోజుల్లో నిమ్స్ ఆసుపత్రిలో కొత్త బ్లాక్ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. నిమ్స్‌లో రోబోటిక్ సర్జికల్ సిస్టమ్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన హరీశ్... నూతనంగా ఏర్పాటు చేయనున్న బ్లాక్ రూ.1571 కోట్లతో రెండు వేల పడకలతో నిర్మాణం జరగనుందని చెప్పారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాలపై కొంత మంది అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.
TS Government give Facilities to NIMS Hospital : కొందరు కళ్లు ఉండి నిజాన్ని చూడలేని పరిస్థితికి వచ్చేశారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. అటువంటి వారు బీఆర్ఎస్ ప్రభుత్వంపైన నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని... అవగాహన లేకుండా మాట్లాడే వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేకుండా నిమ్స్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. దేశంలోనే వైద్యరంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని గుర్తు చేశారు.
Foundation for NIMS New Block : నిమ్స్‌లో కొత్త బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
రాష్ట్రం ఏర్పడక ముందు 11 స్థానంలో తెలంగాణను తాము అభివృద్ధి చేసి ఆ స్థానానికి తీసుకువచ్చామని హరీశ్ తెలిపారు. వైద్య సిబ్బంది అందరూ కలిసి పనిచేస్తే మొదటి స్థానాన్ని తొందరలోనే చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో తెలంగాణని చాలా విషయాల్లో ఆదర్శంగా తీసుకునేలా తీర్చిదిద్దారని అన్నారు. అన్ని రాష్ట్రాలు తెలంగాణలో అమలు చేసిన విధానాలే పాటించాలని అనుకుంటున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు నిమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సౌకర్యాల వివరాలు తెలిపారు.
- కొత్త పరికరాల కొనుగోలు కోసం ప్రభుత్వం రూ.154 కోట్లు కేటాయించింది.
- దేశంలోనే నెం.1 డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు చేసింది.
- 82 నుంచి 169కి పీజీ మెడికల్ సీట్లు పెంచింది.
నిమ్స్ ఆసుపత్రి కోసం చేయవల్సినవి :
- రూ.25 కోట్లు ఆరోగ్య శ్రీ నుంచి విడుదల చేయాలని ఆదేశించాం.
- ప్రభుత్వం నుంచి రూ.35 కోట్లు పెండింగ్ నిధులు విడుదల చేయనున్నాం.
- 2000 పడకల దశాబ్ది బ్లాక్ నిర్మించనున్నాం.
దీంతో పాటు రాష్ట్రం ఏర్పడిన తరవాత 753 కిడ్నీ ట్రాన్సప్లాంటేషన్‌లు, 154 బోన్ మారో ట్రాన్సప్లాంటేషన్‌లు, 1444 మోకీళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు చేశారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వైద్యులకి కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ.. వారిని ప్రోత్సహిస్తున్నామన్నారు.
"తెలంగాణ వచ్చాక నిమ్స్‌లో సౌకర్యాలు పెరిగాయి. వచ్చే 10 రోజుల్లో నిమ్స్ నిర్మాణం ప్రారంభం అవుతుంది. నిమ్స్‌పై కొంతమంది అసత్య ఆరోపణలు చేస్తున్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఆరోపణలు చేయడం మంచిది కాదు. అవగాహన లేకుండా మాట్లాడేవారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం నుంచి రాజకీయ ఒత్తిడి లేకుండా నిమ్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం. దేశంలో వైద్యరంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది."- హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి
ఇవీ చదవండి :