డిప్యూటీ తహసీల్దార్లకు పదోన్నతులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. పదోన్నతుల కోసం సీనియారిటీ జాబితాను రూపొందించింది. ఐదో జోన్లో 152 మంది, ఆరో జోన్లో 186 మంది... మొత్తం 338 మంది డిప్యూటీ తహసీల్దార్లు జాబితాలో ఉన్నారు.
సీనియారిటీ జాబితాపై మూడు రోజుల్లో అభ్యంతరాలకు అవకాశం ఇచ్చారు. పదోన్నతుల నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్లకు సంబంధించిన వార్షిక రహస్య నివేదికలు, వారిపై ఏవైనా క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఉంటే వాటి వివరాలతో పాటు ఇతర ప్రత్యేక రిమార్కులు ఉంటే పంపాలని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.
ఇదీ చూడండి : యాదాద్రి ఆలయంలో ఆకట్టుకుంటున్న నిర్మాణ పనులు