ETV Bharat / state

విద్యార్థులకు బిగ్ అలర్ట్​ - స్కాలర్​షిప్ దరఖాస్తుల గడువు పెంపు - లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

TS Post-Matric Scholarship Update: తెలంగాణ సర్కార్ 2023-24 విద్యాసంవత్సరం స్కాలర్​షిప్​లకు​ సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. డిసెంబర్ 31 వరకు ఉన్న గడువు తేదీని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్లై చేసుకోలేకపోయిన కొత్తవారు, రెన్యూవల్ చేసుకోని వారికి మరో సువర్ణావకాశంగా దీనిని చెప్పుకోవచ్చు. ఇంతకీ లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 4:05 PM IST

Scholarship
Scholarship

TS ePass Scholarship 2023-24 Application Last Date : తెలంగాణ సర్కార్ విద్యను ప్రోత్సహించడానికి తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్ ఆఫ్ స్కాలర్‌షిప్స్(TS ePASS)ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వివిధ రకాల ఫీజులతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రిజర్వ్​డ్ కోటాకు చెందిన విద్యార్థులకు.. ప్రతి ఏడాది స్కాలర్​షిప్స్​ రూపంలో కొంతమేర సహాయం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం TS ePASS(టీఎస్ ఈ-పాస్) ఆన్​లైన్​ సిస్టమ్​లో విద్యార్థులు ప్రతి సంవత్సరం అప్లై చేసుకుంటారు. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం 2023-24 స్కాలర్​షిప్స్​ దరఖాస్తులకు సంబంధించి తెలంగాణ సర్కార్ బిగ్ అప్​డేట్​ ఇచ్చింది. స్కాలర్​షిప్​ల అప్లికేషన్​ గడువును మరికొన్ని రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ చివరి తేదీ ఎప్పుడు? ఎలా అప్లై చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

TS ePASS Post-Matric Scholarship : ప్రస్తుత విద్యా సంవత్సరం 2023-24కి సంబంధించి స్కాలర్ షిప్​ల కోసం అప్లికేషన్స్ ప్రక్రియ 2023 ఆగస్టు 19న ప్రారంభమైంది. అప్పటినుంచి స్టార్ట్ అయిన దరఖాస్తుల స్వీకరణకు డిసెంబర్ 31, 2023 చివరి తేదీగా ప్రభుత్వం పేర్కొంది. కానీ, ఆ గడువును మరికొన్ని రోజులు పెంచుతూ.. దరఖాస్తు చేసుకోలేకపోయిన ఫ్రెషర్లు, రెన్యూవల్‌ చేసుకోని వారికి మరో అవకాశం ఇచ్చింది. సంక్షేమ శాఖ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

How to Check TS ePASS Scholarship Status : మీ స్కాలర్​షిప్ స్టేటస్ ఇలా చెక్​ చేసుకోండి..!

చివరి తేదీ ఎప్పుడంటే.. తెలంగాణ ప్రభుత్వం స్కాలర్ షిప్ దరఖాస్తుల గడువును 2024 జనవరి 31 వరకు పొడిగించింది. కాబట్టి ఇంకా దరఖాస్తు చేసుకోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు వెంటనే అప్లై చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే లక్షల మంది స్టూడెంట్స్ టీఎస్ ఈ-పాస్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్ కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇంకా చాలా మంది చేసుకోవాల్సి ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్లై చేసుకోలేకపోయిన ఫ్రెషర్లు, రెన్యూవల్‌ చేసుకోని వారికి సర్కార్ మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందివచ్చిన ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఓ ప్రకటనలో కోరింది. కాబట్టి ఇంకా చేసుకోని వారెవరైనా ఉంటే ఇప్పుడే టీఎస్ ఈపాస్ అధికారిక వెబ్​సైట్​కి వెళ్లి దరఖాస్తు చేసుకోండి.

How to Apply TS ePASS Post-Matric Scholarship:

టీఎస్ ఈపాస్ స్కాలర్‌షిప్​ను అప్లై చేసుకోండిలా..

  • ముందు మీరు తెలంగాణ ఈపాస్ అధికారిక వెబ్‌సైట్ https://telanganaepass.cgg.gov.in/ లోకి వెళ్లాలి.
  • అనంతరం మీ విద్యార్హత ప్రకారం స్కాలర్​షిప్ రకాన్నిసెలెక్ట్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత 'Fresh Registration' అనే ఆప్షన్​ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి
  • అప్పుడు బ్రౌజర్​లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • అనంతరం అడిగిన పూర్తి వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్​లోడ్ చేయాలి.
  • ఇక చివరగా.. అప్లికేషన్​లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "Submit" చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకొని.. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ రిఫరెన్స్ నంబర్​ను నోట్ చేసుకోవాలి.

గమనిక : ఒకవేళ మీరు స్కాలర్​షిప్​ను రెన్యూవల్ చేసుకోవాలంటే కూడా పైన పేర్కొన్న విధంగానే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. Fresh Registration ప్లేస్​లో Renewal Registration ఆప్షన్​పై క్లిక్​ చేసి మిగిలిన వివరాలు నమోదు చేయాలి.

పేద విద్యార్థులకు LIC స్కాలర్​షిప్​ - అప్లై చేసుకోండిలా!

Scholarships 2023 : మీ పిల్లలు ఆ కోర్సు చదువుతున్నారా?.. ఏడాదికి రూ.50వేలు స్కాలర్​ షిప్​ పొందే ఛాన్స్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.