ETV Bharat / state

రాష్ట్రంలో ఇంజినీరింగ్​ రెండో విడత కౌన్సిలింగ్​ ఆపాలి: హైకోర్టు - ఎంసెట్​ కౌన్సిలింగ్​ తాజా వార్తలు

టీఎస్​ ఎంసెట్​ రాసేందుకు ఇంటర్​ మార్కులపై ఉన్న నిబంధనను ఎత్తివేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన న్యాయస్థానం గురువారం నుంచి జరగాల్సిన ఇంజినీరింగ్ ​రెండో విడత ఎంసెట్​ కౌన్సిలింగ్​ను ఆపాలని ఆదేశించింది

ts eamcet counselling postponed by high court of telangana
రాష్ట్రంలో ఇంజినీరింగ్​ రెండో విడత కౌన్సిలింగ్​ ఆపాలి: హైకోర్టు
author img

By

Published : Oct 28, 2020, 11:14 PM IST

గురువారం నుంచి జరగాల్సిన ఇంజినీరింగ్​ రెండో విడత ఎంసెట్​ కౌన్సిలింగ్​ను ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. టీఎస్​ ఎంసెట్​ రాసేందుకు ఇంటర్​లో కనీసం 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనను ఎత్తివేయాలని కోరుతూ కొందరు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్​పై హైకోర్టు విచారణ చేపట్టింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించకుండా.. అందరికీ 35 శాతం మార్కులు వేసి ఉత్తీర్ణులను చేసినట్లు పిటిషనర్లు వాదించారు.

కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగిందనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఎంసెట్​ నిబంధనలను సవరిస్తూ రెండు, మూడు రోజుల్లో జీవో ఇవ్వనున్నట్లు అడ్వకేట్ జనరల్​ బీఎస్​ ప్రసాద్​ వివరించారు. ఏజీ వివరణను హైకోర్టు నమోదు చేసుకుంది. ఈ మేరకు గురువారం నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ ప్రక్రియను వాయిదా వేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండిః ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థుల సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.