ETV Bharat / state

TS EAMCET BiPC Counselling Schedule : రేపటి నుంచే ఎంసెట్ బైపీసీ కౌన్సెలింగ్.. అందుబాటులో 8312 సీట్లు - ఎంసెట్​ బైపీసీ కౌన్సెలింగ్

TS EAMCET BiPC Counselling Schedule 2023 : ఎంసెట్​ బైపీసీ అభ్యర్థులకు శనివారం నుంచి ప్రవేశాల ప్రక్రియ మొదలవుతుందని విద్యాశాఖ తెలిపింది. ఈ నెల 4న వెబ్​ ఆప్షన్లు స్వీకరించి.. 11న సీట్లు కేటాయిస్తారని ప్రకటించింది. మరోవైపు ఇంటర్మీడియట్​ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు తేదీని రూ.1000లు ఆలస్య రుసుముతో ఈ నెల 16 వరకు పెంచింది.

Intermediate First Year Joining Last Date
Eamcet Bipc Counselling dates in Telangana
author img

By Telangana

Published : Sep 1, 2023, 9:49 PM IST

TS EAMCET BiPC Counselling Schedule 2023 : ఎంసెట్ బైపీసీ అభ్యర్థులకు శనివారం నుంచి కౌన్సెలింగ్ జరగనుందని విద్యాశాఖ తెలిపింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం శని, ఆదివారాల్లో ఆన్​లైన్​లో స్లాట్ బుకింగ్(Online Slat Booking) చేసుకోవాలి పేర్కొంది. ఈ నెల 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ప్రకటించింది. ఈ నెల 4 నుంచి 7 వరకు వెబ్ ఆప్షన్లు స్వీకరించి.. 11న సీట్లు కేటాయించనున్నారు. బైపీసీ అభ్యర్థులకు అయిదు కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 8 వేల 312 సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 114 కాలేజీల్లో 6 వేల 910 బీఫార్మసీ సీట్లు.. 61 కళాశాలల్లో 1191 ఫార్మ్ డీ సీట్లు.. మూడు కాలేజీల్లో 94 బయో టెక్నాలజీ.. రెండు కాలేజీల్లో 36 బయోమెడికల్ ఇంజినీరింగ్, రెండు కాలేజీల్లో 81 ఫార్మాస్యూటికల్ సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

Engineering Seats in Telangana 2023 : రాష్ట్రంలో మిగిలిపోయిన ఇంజినీరింగ్‌ సీట్లు 16,926

Intermediate Joining date Extend in Telangana : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు ఈ నెల 16 వరకు పొడిగించినట్లు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వెయ్యి రూపాయల ఆలస్య రుసుము(Late Fee)తో ఈనెల 16 వరకు కాలేజీలో చేరవచ్చునని ఇంటర్ బోర్డు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇంటర్ మొదటి సంవత్సరంలో 4 లక్షల 92 వేల 873 మంది చేరారు. రాష్ట్రంలోని 1285 ప్రైవేట్ కాలేజీల్లో 3 లక్షల 11 వేల 160 మంది చేరగా.. 408 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 83 వేల 177 మంది చేరారు. ఎస్సీ గురుకులాల్లో 16 వేల 102.. బీసీ గురుకులాల్లో 14 వేల 77.. మైనారిటీ గురుకులాల్లో 10 వేల 506.. గిరిజన గురుకులాల్లో 8 వేల 416.. జనరల్ గురుకులాల్లో 2 వేల 560 మంది విద్యార్థులు చేరారు. గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో 4 లక్షల 98 వేల 699 మంది చేరారు.

ఇప్పటి వరకు ఏ ఏ కళాశాల్లో ఎంత మంది విద్యార్థులు చేరారు :

క్రమ సంఖ్య కాలేజ్​ ఎంత మంది
1 ప్రైవేట్ కాలేజ్​ 3,11,160
2 ప్రభుత్వ కాలేజ్​ 83,177
3 ఎస్సీ గురుకులాలు 16,102
4 బీసీ గురుకులాలు 14,077
5 మైనారిటీ గురుకులాలు 10,506
6 గిరిజన గురుకులాలు 8,416
7 జనరల్ గురుకులాలు 2,506
మొత్తం 4,92,873

TS EAMCET 2023 addmission counselling schedule : వృత్తి విద్యాకోర్సుల అడ్మిషన్ షెడ్యూల్ విడుదల

TS EAMCET Councelling From Today : నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

TS Engineering counseling schedule 2023 : ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.