ETV Bharat / state

తెలంగాణలో పాఠశాలలకు 120 పనిదినాలు! - Latest news of schools in Telangana

ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలకు కనీసం 120 పనిదినాలు ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. డిసెంబరులో తెరిస్తేనే సాధ్యమని విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షలు పెట్టే పరిస్థితి లేకుంటే ప్రాజెక్టులు, అసైన్‌మెంట్ల ఆధారంగా ఉత్తీర్ణత సాధించవచ్చని యోచిస్తోంది.

The state Department of Education expects schools to have at least 120 working days during the school year
తెలంగాణలో పాఠశాలలకు 120 పనిదినాలు!
author img

By

Published : Nov 14, 2020, 7:46 AM IST

రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం(2020-21)లో పాఠశాలలకు కనీసం 120 పనిదినాలు ఉండాలని విద్యాశాఖ భావిస్తోంది. అది జరగాలంటే కచ్చితంగా బడులను తెరవాలని నిర్ణయించింది. కనీసం 120 రోజులు ప్రత్యక్షంగా తరగతి గది బోధన జరిగితేనే విద్యార్థులు కనీస విద్యా సామర్థా్యలు పొందేలా చేయగలమని, వారికి వార్షిక పరీక్షలు జరపడానికి వీలవుతుందని విద్యాశాఖ యోచిస్తోంది.

ఈ విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్‌/మే నెలాఖరు వరకు కొనసాగించినా పండగ, ఇతర సెలవులను మినహాయిస్తే 120 రోజుల పనిదినాలు రావాలంటే డిసెంబరులోనే 9, 10 తరగతులతో పాటు ఇంటర్‌ తరగతులూ మొదలుపెట్టాల్సి ఉంటుందని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ సమక్షంలో జరిగిన విద్యాశాఖ, ఇతర సంక్షేమ శాఖల అధికారుల సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందని సమాచారం. కేంద్రం సైతం ఈ విద్యా సంవత్సరాన్ని శూన్య సంవత్సరంగా (జీరో ఇయర్‌) ఎట్టి పరిస్థితుల్లో చేసేదిలేదని తేల్చిచెప్పిందని, పరీక్షలు ఎలా నిర్వహించాలన్న దానిపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను కోరిందని, తాము కూడా పంపామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. డిసెంబరులో తెరవాలని అధికారులు విద్యాశాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించనున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రి ఆమోదానికి దస్త్రం వెళ్తుంది. పాఠశాలల ప్రారంభానికి అనుమతి ఇచ్చే ముందు వైద్యశాఖ అభిప్రాయాన్ని కూడా తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వ బడుల్లో 22 లక్షల మంది పిల్లలు ఉన్నారని, వారిలో సగం మంది వస్తారని అంచనా వేసినా అంతమందికి కరోనా పరీక్షలు చేయడం కుదిరే పని కాదని ఓ అధికారి స్పష్టంచేశారు.

ప్రాజెక్టులూ కీలకం కావొచ్చు

1-10 తరగతుల్లోని ప్రతి సబ్జెక్టులో 70 శాతం సిలబస్‌ను పరీక్షల కోసం, మిగిలిన 30 శాతాన్ని ప్రాజెక్టులు, అసైన్‌మెంట్ల కోసం విభజించిన సంగతి తెలిసిందే. ఒకవేళ తుది పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనప్పుడు ప్రాజెక్టులు/అసైన్‌మెంట్లకు ఇచ్చిన మార్కులు/గ్రేడ్ల ఆధారంగా ఉత్తీర్ణత మార్కులను గణించే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టంచేశారు. అందువల్ల 30 శాతం సిలబస్‌ బోధన, అసైన్‌మెంట్లపై అశ్రద్ధ చేయడం మంచిది కాదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.