KTR at Telangana Formation Day Celebrations : తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని.. జాతీయ జెండాను ఎగురవేశారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన వేడుకల్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొనగా.. సిరిసిల్లలో జరిగిన ఉత్సవాల్లో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు.. ఈ పదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించారు.
harish Rao Tweet on TS Formation Day : ఈ సందర్భంగా రానే రాదన్న తెలంగాణను సాధించి.. కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించి.. అనతి కాలంలోనే తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపారని పేర్కొన్నారు. ఈ 9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్‌కు మార్గదర్శిగా మార్చింది మన సీఎం అని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్ అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ప్రజల జీవితాల్లో వెలుగు నింపాయన్న హరీశ్‌రావు.. తెలంగాణ ఆచరిస్తే, నేడు దేశం అనుసరిస్తుంది తెలిపారు. అందుకే 'తెలంగాణ మాడల్' దేశమంతటా ఆకర్షించేలా విరాజిల్లుతుందని వివరించారు. అవమానాలు, అన్యాయాలకు గురైన చోటే స్వరాష్ట్రంలో సమగ్రాభివృద్ధి చెంది.. సగర్వంగా దశాబ్ది సంబురం చేసుకొంటున్న చారిత్రక సందర్భం ఇది అని మంత్రి ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు.
-
రానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
అనతి కాలంలోనే ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపింది కేసీఆర్
9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్ కు మార్గదర్శిగా మార్చింది… pic.twitter.com/38LOuAVZnv
">రానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2023
అనతి కాలంలోనే ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపింది కేసీఆర్
9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్ కు మార్గదర్శిగా మార్చింది… pic.twitter.com/38LOuAVZnvరానే రాదన్న తెలంగాణను సాధించి, కానే కాదన్న అభివృద్ధిని చేసి చూపెట్టింది కేసీఆర్
— Harish Rao Thanneeru (@BRSHarish) June 2, 2023
అనతి కాలంలోనే ప్రగతి పథంలో నడిపించి తెలంగాణను ఎవరెస్టు శిఖరమంత ఎత్తున నిలిపింది కేసీఆర్
9 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధికి రోల్ మోడల్ గా చేసి, 76 ఏళ్ల స్వతంత్ర భారత్ కు మార్గదర్శిగా మార్చింది… pic.twitter.com/38LOuAVZnv
KTR Tweet on Telangana Decade Celebrations : మరోవైపు.. పోరాట యోధుడే పాలకుడై సాధించిన తెలంగాణను సగర్వంగా.. దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ మన తెలంగాణ నేల దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకుంటోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం పదేళ్లలోనే.. వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన తెలంగాణ తోబుట్టువులందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
-
పోరాట యోధుడే పాలకుడై..
— KTR (@KTRBRS) June 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
సాధించిన తెలంగాణను సగర్వంగా...
దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ...
దశాబ్ది వేడుకలను
ఘనంగా జరుపుకుంటోంది
మన తెలంగాణ నేల...
కేవలం పదేళ్లలోనే...
వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..
తెలంగాణ తోబుట్టువులందరికీ..
రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా… pic.twitter.com/IGn7zcXFaS
">పోరాట యోధుడే పాలకుడై..
— KTR (@KTRBRS) June 2, 2023
సాధించిన తెలంగాణను సగర్వంగా...
దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ...
దశాబ్ది వేడుకలను
ఘనంగా జరుపుకుంటోంది
మన తెలంగాణ నేల...
కేవలం పదేళ్లలోనే...
వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..
తెలంగాణ తోబుట్టువులందరికీ..
రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా… pic.twitter.com/IGn7zcXFaSపోరాట యోధుడే పాలకుడై..
— KTR (@KTRBRS) June 2, 2023
సాధించిన తెలంగాణను సగర్వంగా...
దేశంలోనే సమున్నతంగా నిలిపిన వేళ...
దశాబ్ది వేడుకలను
ఘనంగా జరుపుకుంటోంది
మన తెలంగాణ నేల...
కేవలం పదేళ్లలోనే...
వందేళ్ల ప్రగతికి సజీవ సాక్షిగా నిలిచిన..
తెలంగాణ తోబుట్టువులందరికీ..
రాష్ట్ర అవతరణ
దశాబ్ది ఉత్సవాల సందర్భంగా… pic.twitter.com/IGn7zcXFaS
ఆ ఘనత కేసీఆర్‌దే..: ఎన్ని కష్టాలు అడ్డొచ్చినా ఎదుర్కొని.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడుపుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దని బీఆర్‌ఎస్ పార్లమెంట్ పక్షనేత కె. కేశవరావు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన జెండా అవిష్కరించారు. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్ని కేసులు పెట్టినా అడ్డుకుని రైతులకు నీళ్లందించామని తెలిపారు. ప్రజల సహకారంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమయ్యిందని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లోనూ చేసిన అభివృద్ధిని చూపుతూ ప్రజల్లోకి వెళ్లాలని నేతలకు సూచించారు.
ఇవీ చూడండి..
Telangana Formation Day celebrations 2023 : దద్దరిల్లేలా దశాబ్ది వేడుకలకు తెలంగాణ ముస్తాబు
KCR Wishes Telangana Formation Day : 'తెలంగాణ బిడ్డలకు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు'