ETV Bharat / state

సడలింపులు ఇవ్వాలా.. వద్దా.. నేడు కేబినెట్ భేటీ​

ఈనెల 20 నుంచి లాక్‌డౌన్‌ సడలింపుల అంశంపై నేడు మంత్రిమండలి కీలకనిర్ణయం తీసుకోనుంది. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై మంత్రివర్గం చర్చించనుంది. సడలింపులిస్తే పరిస్థితిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులు, నిపుణులతో చర్చించారు. రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరుగుతున్నందున.. సడలింపులు ఇవ్వకుండా లాక్‌డౌన్ కొనసాగించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపైనా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది.

నేడు కేబినెట్ భేటీ​
నేడు కేబినెట్ భేటీ​
author img

By

Published : Apr 19, 2020, 6:04 AM IST

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతోంది. జోన్‌ల వారీగా విభజించి కరోనా కట్టడికి అధికార యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. వీటి ఆధారంగా కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించింది. ఈనెల 20నుంచి రెడ్‌జోన్‌లు మినహా మిగతా చోట్ల షరతులతో కూడిన అనుమతులు జారీచేసింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలతో పాటు భవన నిర్మాణాలకు అనుమతించింది. అయితే ఇవన్నింటిపై ఆయా రాష్ట్రాల్లో పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవచ్చని కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు జరిగే కేబినెట్‌ భేటీలో మినహాయింపులపై స్పష్టత ఇవ్వనుంది.

సడలింపులు ఇవ్వాలా? వద్దా?

లాక్‌డౌన్‌ను మే 3 వరకు యథావిధిగా కొసాగించడమా లేక కేంద్రప్రభుత్వ సూచనల మేరకు... సడలింపు ఇవ్వాలా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుదీర్ఘ కసరత్తు చేసింది. పలువురు అధికారులతో సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ప్రగతిభవన్‌లో మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి, లాక్‌డౌన్ అమలు, ఆర్థిక పరిస్థితులపై ప్రధానంగా చర్చించారు. ఈనెల 25 నుంచి రంజాన్‌ మాసం ప్రారంభమవుతుండటం వల్ల తీసుకోవాల్సిన చర్యలు కూడా కీలకం కానున్నాయి.

మరికొన్ని రోజులు కఠినంగా..?

కేంద్రం పేర్కొన్న రంగాలకు మినహాయింపులిస్తే ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. జీహెచ్​ఎంసీ పరిధిలో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున... జనం పెద్దసంఖ్యలో బయటకు వస్తే...... పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని ప్రభుత్వం ఆందోళనగా ఉందని తెలుస్తోంది. కేంద్రం మార్గదర్శకాలు, రాష్ట్రంలోని పరిస్థితిపై... మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు. ఇప్పుడే సడలింపులు ఇవ్వొద్దని.. మరికొద్దిరోజులు లాక్‌డౌన్ కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రికి వారు సూచించారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన చర్చ..!

రాష్ట్రఆర్థిక పరిస్థితిపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. లాక్‌డౌన్ వల్ల... రాష్ట్ర ఆదాయం భారీగా పడిపోయింది. హెలికాప్టర్ మనీ విధానాన్ని అమలు చేయాలని సీఎం కేసీఆర్ సూచించినా.. కేంద్రం నుంచి స్పందన కనిపించడం లేదు. ఈ తరుణంలో ఏం చేయాలన్న అంశంపైనా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. రేషన్, నగదు బదిలీ, వ్యవసాయ రంగం, పంటల కొనుగోళ్లు, విశ్రాంత ఉద్యోగుల పింఛనులో కోత, తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చూడండి: ఇవీ చూడండి: మహారాష్ట్రలో 24 గంటల్లో 368 కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.