ప్ర: ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఏంటి, ఆ నిర్ణయం ప్రభావం ఏలా ఉండబోతుంది?
జ: ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా ఇతర దేశాల వారికి ట్రావెల్ బాన్ ప్రకటించారు. ఇంకా ఏయే విభాగాలపై నిషేధం ఉంటుందనేది ప్రత్యేకంగా వివరించలేదు.
ప్ర: ఆ నిర్ణయం వల్ల భారతీయ విద్యార్థులు, యువతపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
జ:ఇమ్మిగ్రేషన్ రద్దు చేయడం వల్ల భారతీయ యువత ఆందోళన చెందే అవకాశం ఉంది. కానీ తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తోంది.
ప్ర: అసలు అమెరికాలో ఎక్కువగా ఏయే రంగాల్లో భారతీయులు పనిచేస్తున్నారు?
జ: ఎక్కువగా ఐటీ, డాక్టర్లు, లాయర్లు, నర్సులు, రీసెర్చ్ విభాగాల్లో ఉంటారు. అదే కాకుండా మిగతా రంగాల్లో కూడా భారతీయులు పనిచేస్తున్నారు.
ప్ర: కేవలం కరోనా వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారా లేక ఇంకెమైనా కారణాలు ఉన్నాయా?
జ: కచ్ఛితంగా కరోనా వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు.
ప్ర: ట్రంప్ గతంలో తీసుకున్న నిర్ణయాలు అక్కడి న్యాయవాదులు తోసిపుచ్చారు. ఇప్పుడేమైనా అలాంటి అవకాశం ఉంటుందా?
జ: కచ్ఛితంగా అని చెప్పలేం. కానీ అవకాశం ఉంటుంది.
ప్ర: అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం ఎలా చూపబోతుంది?
జ: ప్రస్తుతం అక్కడ భారతీయ విద్యార్థులకు చదువు పరంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆన్లైన్లో క్లాసులు వినే అవకాశం ఇప్పటికే కల్పిస్తున్నారు.
ప్ర: ట్రావెల్ బ్యాన్ గతంలో ఎవరైనా అధ్యక్షులు తీసుకున్నారా?
జ: చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు.
ప్ర: అక్కడే అమెరికాలో ఉన్నవాళ్లకు ఈ నిర్ణయం ఎలా ప్రభావం చూపుతుంది?
జ: అమెరికాలో ఉన్న వాళ్లకు ఈ ప్రభావం ఉండకపోవచ్చు. బయటి నుంచి వచ్చే వాళ్లపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ప్ర: ఈ నిర్ణయం వల్ల ఐటీ కంపెనీలు కొనసాగించకపోవచ్చు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందా?
జ: అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక దెబ్బ అని చెప్పవచ్చు.
ప్ర: ఈ నిర్ణయం తాత్కాలిక ఆర్డర్ అన్నారు, అంటే ఎంత కాలం ఉంటుంది?
జ: తాత్కాలికం అన్నారు కాబట్టి 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉండకపోవచ్చు.
ప్ర: మీరు ఓక న్యాయవాదిగా అక్కడి విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఎలాంటి సలహాలు ఇవ్వనున్నారు?
జ: ఉద్యోగార్థులకు ఇబ్బంది ఉండదు. ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ప్ర: కరోనా ప్రభావం న్యూయార్క్లో ఎలా ఉంది?
జ: న్యూయార్క్లో కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. కానీ ప్రస్తుతం కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి.
ప్ర: తాజా ట్రావెల్ బ్యాన్ నిర్ణయం 6 నెలల్లో ముగుస్తుందా.. తర్వాత కూడా ఆ ప్రభావం ఉంటుందా.?
జ: ప్రత్యేక విభాగాల్లో ఉన్న వారిపై ప్రభావం చూపనుంది.
ప్ర: ఈ నిరుద్యోగం కోసం ఎలాంటి సహాయం చేస్తుంది?
జ: గత నెల వరకు నిరుద్యోగ భృతి కోసం రెండు కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్థిక సహాయం సైతం చేస్తున్నారు.
ప్ర: ఇలాంటి తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం, ఈ నిర్ణయం వల్ల ఏయే రంగాలపై ప్రభావం ఉండనుంది?
జ: కరోనా వైరస్ వల్ల ఒక్క రంగంలో అని కాకుండా అన్ని రంగాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది.
ఇదీ చూడండి : 'కేసీఆర్ను ప్రశంసించిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు'