ఏపీలోని కడప విమానాశ్రయం నుంచి వివిధ ప్రాంతాలకు తమ విమానంలో ప్రయాణించేవారికి టికెట్ ధరను ట్రూజెట్ సంస్థ తగ్గించింది. రూ.921 రూపాయలకే ట్రూజెట్ విమానంలో కడప నుంచి విజయవాడ, హైదరాబాద్, బెల్గాం, చెన్నై ప్రాంతాలకు వెళ్లే అవకాశం కల్పించింది. ఈనెల 8 నుంచి 15వ తేదీ వరకు టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ధర వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈనెల 9 నుంచి అక్టోబరు 30వ తేదీ వరకు ఎపుడైనా ప్రయాణం చేయవచ్చని సంస్థ తెలిపింది. కడప నుంచి వెళ్లేవారితో పాటు కడపకు వచ్చే వారికి ఇదే ధర వర్తిస్తుందని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. కడప నుంచి విజయవాడకు ప్రతిరోజు ట్రూజెట్ విమానం నడుస్తుండగా... మిగిలిన ప్రాంతాలకు వారంలో మూడు రోజులు సర్వీసు అందుబాటులో ఉంది.
ఇదీ చదవండి: 'సంక్రాంతి తర్వాత ప్రతి గ్రామంలో రైతులతో ముఖాముఖి'