ETV Bharat / state

వరద ప్రవాహానికి బోల్తా పడిన ట్రాక్టర్ - Truck submerged in flood water

నర్సరీ మొక్కలను తరలిస్తున్న ట్రాక్టర్ వరద ప్రవాహానికి బోల్తా పడిన ఘటన ఏపీ తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రక్కు మాత్రం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

వరద ప్రవాహానికి బోల్తా పడిన ట్రాక్టర్
వరద ప్రవాహానికి బోల్తా పడిన ట్రాక్టర్
author img

By

Published : Aug 18, 2020, 11:50 AM IST

నర్సరీ మొక్కలను తరలిస్తుండగా వరద ప్రవాహానికి ట్రాక్టర్ అదుపు తప్పి తిరగబడింది. ఈ ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఆలుమూరు మండలం బడుగువానిలంక వద్ద జరిగింది. గ్రామ పరిధిలో నిమ్మ మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా నర్సరీ నీటిలో మునిగిపోయింది.

ఈ క్రమంలో కొన్ని మొక్కలనైనా బయటికి తీసి ట్రాక్టర్​లో తరలించాలనుకున్నారు. ఈ క్రమంలో... ఒక్కసారిగా వాహనం బోల్తా పడింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ట్రక్కు మాత్రం నీటిలో పూర్తిగా మునిగిపోయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.