ETV Bharat / state

మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు : మంత్రి తలసాని - మంత్రి కేటీఆర్

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డివిజన్ పరిధి కలాసిగూడ ప్రభుత్వ పాఠశాలలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సనత్​నగర్ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి కేక్ కట్ చేశారు.

మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు : మంత్రి తలసాని

author img

By

Published : Jul 24, 2020, 12:54 PM IST

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డివిజన్ పరిధి కలాసిగూడ ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో మంత్రి తలసాని మొక్కలకు నీటిని పోశారు. తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు జీవించాలని మంత్రి తలసాని ఆకాంక్షించారు. మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి తలసాని కితాబిచ్చారు.

అంచెలంచెలుగా ఎదిగి...

అంచెలంచెలుగా ఎదిగి ఐటి శాఖకు వన్నెతెచ్చిన నాయకుడిగా కేటీఆర్ నిలుస్తారని మంత్రి తలసాని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ ప్రజాభిమానాన్ని చూరగొన్నారని తలసాని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ హైదరాబాద్​లో పెట్టుబడులు వచ్చేందుకు కేటీఆర్ ఎంతగానో కృషి చేశారన్నారు. యువ నేతగా ప్రజా మన్ననలు పొందిన కేటీఆర్... కరోనా విపత్కర సమయంలోనూ అభివృద్ధి విషయంలో లోటు రాకుండా అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తలసాని వెల్లడించారు.

ఇవీ చూడండి : మంత్రి కేటీఆర్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు : మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.