ETV Bharat / state

శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలపై తెరాస కసరత్తు - హైదరాబాద్​ వార్తలు

శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలు.. తెరాసకు సవాల్‌గా మారాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల్లో తడబడుతున్న గులాబీ పార్టీ.. ఈ సారి సత్తా చాటేందుకు కసరత్తు చేస్తోంది. ఎన్నికలు జరగనున్న రెండు స్థానాలను కైవసం చేసుకునే దిశగా అస్త్రశస్త్రాలు సిద్ధంచేస్తోంది. గెలుపు బాధ్యతను తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ భుజాన వేసుకున్నారు.

శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలపై తెరాస కసరత్తు

author img

By

Published : Oct 2, 2020, 5:02 AM IST

శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలపై తెరాస కసరత్తు

తెరాస మొదటిసారి అధికారంలోకి వచ్చిన మరుసటి ఏడాదే.. రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి తెరాసకు ఓటమి ఎదురైంది. పార్టీ శ్రేణులు... ఉద్యోగ సంఘాల మద్దతు ఉంటుందన్న నమ్మకంతో టీఎన్జీవో నేత దేవీప్రసాద్​ను బరిలోకి దింపగా.. భాజపా అభ్యర్థి రామచంద్రరావు చేతిలో ఓడిపోయారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి తెరాస నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లు దక్కకపోయినా.. రెండో ప్రాధాన్యతో సరిపెట్టుకున్నారు.

ఓటమి తప్పలేదు

అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి తిరుగులేని విజయం నమోదు చేసిన తెరాసకు.. ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి విజయం సాధించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నర్సిరెడ్డి చేతిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ నుంచి తెరాస మద్దతు ఉన్న పాతూరి సుధాకర్‌రెడ్డిపై... పీఆర్​టీయూ నేత రఘోత్తమ్‌రెడ్డి గెలిచారు. ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించలేదని.. ప్రచారం చేయలేదని.. తెరాస నేతలు చెబుతున్నారు.

పోటీలో కోదండరాం

కాని ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తాచాటేలా పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది గులాబీ పార్టీ. రెండింటిలోనూ గెలిచి తెరాసకు విద్యాధికుల మద్దతు అంతంత మాత్రమేనన్న ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని భావిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పోటీ చేస్తారని ప్రకటించారు. గతేడాది ఎన్నికల్లో తెరాస పవనాలు రాష్ట్రమంతటా ఒకేవిధంగా విచినా... ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మాత్రం కొంత తక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానాన్ని ఈసారి గులాబీ పార్టీ ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోంది.

బరిలో బొంతు రామ్మోహన్​!

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో గత పట్టభద్రుల ఎన్నికల పరిస్థితితో పోలిస్తే... ఇప్పుడు పూర్తిగా పట్టు సాధించినట్లు తెరాస భావిస్తోంది. త్వరలో జరగనున్న జీహెచ్​ఎంసీ ఎన్నికల్లోనూ భారీ విజయం సాధిస్తామన్న విశ్వాసంతో ఉంది. భాజపా సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు మరోసారి పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్ నుంచి మరోసారి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పోటీ చేస్తారని.. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ రంగంలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.

వ్యూహ, ప్రతివ్యూహాలు

రెండు పట్టభద్రుల స్థానాల్లో గెలుపొందేందుకు తెరాస వ్యూహ, ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తోంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్​ స్వయంగా బాధ్యతలను భుజాన వేసుకున్నారు. నియోజకవర్గాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలతో పలుమార్లు సమావేశమై ప్రణాళికలు రూపొందించారు. ఓటరుగా నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలన్న కేటీఆర్​ ఆదేశాల మేరకు నేతలు, శ్రేణులు కార్యాచరణ అమలుచేస్తున్నారు.

ఇదీ చదవండి: రైతన్నను కాపాడుకునే విషయంలో దేవునితోనైనా కొట్లాటకు సిద్ధం: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.