తమ సమస్యలను సీఎం కేసీఆర్ తీరుస్తారనే నమ్మకముందని రాష్ట్రంలోని పలు ఉద్యోగ సంఘాలు పేర్కొన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ల సమక్షంలో.. సంఘం నేతలు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. తెరాస అభ్యర్థులు.. సురభి వాణీ దేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డిలను గెలిపించుకుంటామని వారు స్పష్టం చేశారు.
తెలంగాణ పారా మెడికల్, ఒకేషనల్ కళాశాలల యాజమాన్యాల సంఘాలు, తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన రిసోర్సు పర్సన్ల సంఘాలు.. మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్‌లకు.. మద్దతు లేఖను అందజేశారు. సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతివ్వడం సంతోషదాయకమంటూ.. మంత్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: సమస్యల పరిష్కారానికి సీఎం హామీ: ఉద్యోగ సంఘాలు