ETV Bharat / state

'కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ' - ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తాజా వార్తలు

రాష్ట్రానికి అనేకమంది టూరిస్టులు వస్తున్నారని వారందరిని పట్టించుకోవాల్సిన అవసరంలేదని తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ఏ హోదాలో వచ్చారని ఆయన ప్రశ్నించారు.

TRSLP Office
టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయం
author img

By

Published : May 7, 2022, 6:26 PM IST

కాంగ్రెస్ నాయకులు పెట్టిన సభ రైతుల కోసం కాదని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. అది కాంగ్రెస్ కోట్లాట సభ అని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్​తో కలిసి ఆయన పాల్గొన్నారు. రాహుల్‌గాంధీని తెలంగాణలో రాచరికపు గాంధీగా వచ్చారని విమర్శించారు. నిన్న సభలో అన్ని తప్పులు మాట్లాడారని... సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో వాటిని పేరు మార్చి చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ అంటూ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ

"కాంగ్రెస్ నాయకులు వరంగల్ పెట్టిన సభ రైతుల కోసం కాదు. అది కాంగ్రెస్ కోట్లాట సభ. రాహుల్‌గాంధీ తెలంగాణలో రాచరికపు గాంధీగా వచ్చారు. ఆయన రాహుల్ గాంధీ కాదు ..రాహుకల్ గాంధీ. వరంగల్ డిక్లరేషన్ సభ కాదు. కాంగ్రెస్ ప్రస్టేషన్ సభ. అన్ని తప్పులు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేస్తున్నారో వాటిని పేరు మార్చి చెబుతున్నారు." - జీవన్ రెడ్డి తెరాస ఎమ్మెల్యే

కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని తెరాస రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. రాహుల్‌గాంధీ వల్లే కాంగ్రెస్‌ పతనం అవుతుందని సొంత పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. విభజన హామీలపై పార్లమెంట్‌లో తెరాస ఎంపీలు కొట్లాడుతుంటే రాహుల్‌ ఎక్కడికి వెళ్లారని బడుగుల లింగయ్యయాదవ్‌ ప్రశ్నించారు.

ఇదీ చదవండి: KTR on Rahul Gandhi: ఏఐసీసీకి కొత్త నిర్వచనం చెప్పిన మంత్రి కేటీఆర్​

సరస్సులో కొట్టుకొచ్చిన రూ.2వేల నోట్ల కట్టలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.