ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గ తెరాస సీనియర్ నాయకుడు ఆర్.వి మహేందర్ కుమార్ రోజు వారీగా తనకు తోచిన సహాయం చేస్తున్నాడు.
కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీలకు, వారితో వచ్చిన బంధువులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. లాక్ డౌన్ సమయంలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ బస్తీలలో నిరుపేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం