ETV Bharat / state

'కరోనా నిర్మూలనకు సీఎం కేసీఆర్ సైనికుడిలా కృషి చేస్తున్నారు' - hydearabad latest news

లాక్​డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదల కడుపు నింపడానికి ఆదిత్య కృష్ణా చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తెరాస నాయకుడు నందు కిషోర్ వ్యాస్ బిలాల్ ముందుకొచ్చారు. గోశామహల్ డివిజన్​ పరిధిలోని సుమారు 200 మంది పేదలకు నిత్యవసర వస్తువులు, మాస్క్​లను పంపిణీ చేశారు.

TRS leader Kishore Vyas Bilal distributed essential items to the poor
పేదలకు నిత్యవసర వస్తువులు పంపిణీ
author img

By

Published : May 31, 2021, 7:20 PM IST

కరోనా కట్టడికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​లు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్, తెరాస నాయకుడు నందు కిషోర్ వ్యాస్ బిలాల్ అన్నారు. గోశామహల్ డివిజన్​లోని ఆర్యసామాజ్ భవనంలో జోషివాడి, నాయబస్తీ, లక్ష్మినారాయణ బస్తి, గోశామహల్ బస్తీలకు చెందిన 200 వందల మంది పేదలకు ఒక్కొక్కరికి 10 కిలోల బియ్యం, ఎన్ 95 మాస్క్​లను మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్, శైలేష్ కుర్మ​లతో కలసి అందజేశారు.

లాక్​డౌన్​ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు 20 రోజులుగా నిత్యావసర సరుకులు, మాస్కులు ఇవ్వడం గొప్ప విషయమని శైలేశ్​ కుర్మ అన్నారు. స్థానికంగా ఉన్న భాజపా కార్పొరేటర్లు ప్రజల బాధలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తమకు ఎలాంటి ఆపద వచ్చిన నందు బిలాల్ అండగా ఉంటారన్న విశ్వాసం ప్రజల్లో క్రమంగా పెరుగుతోందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Sonu sood: తెలుగు రాష్ట్రాలకు సోనూసూద్ మరో సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.