ETV Bharat / state

తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద గన్​తో తెరాస నాయకుడి హల్​చల్ - హైదరాబాద్​ తాజా వార్తలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస విజయం సాధించంటంతో ఆ పార్టీ నాయకులు తెలంగాణ భవన్​ వద్ద సంబురాలు జరుపుకున్నారు. తెరాస నాయ‌కుడు క‌ట్టెల శ్రీ‌నివాస్‌ యాద‌వ్ తుపాకీ తీయ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

trs leader kattemula srinivas yadav with gun at telangana bhavan in hyderabad
తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద గన్​తో తెరాస నాయకుడు
author img

By

Published : Mar 21, 2021, 4:34 PM IST

తెలంగాణ భ‌వ‌న్ వ‌ద్ద శ‌నివారం నిర్వ‌హించిన సంబు‌రాల్లో తెరాస నాయ‌కుడు క‌ట్టెల శ్రీ‌నివాస్‌యాద‌వ్ తుపాకీతో రావడం కలకలం రేపింది. ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత కార్యకర్తలు, నాయకులు తెలంగాణ భవన్​కు చేరుకున్నారు. విజయోత్సాహంలో మునిగిపోయారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన కట్టెల శ్రీనివాస్ యాదవ్ తుపాకీ తీసి హల్​చల్ చేశారు.

జేబులోంచి తుపాకీ తీసి గాలిలోకి కాల్చేందుకు ప్ర‌య‌త్నించారు. అదే స‌మ‌యంలో ప‌క్క‌నున్న వారు వ‌ద్ద‌ని వారించిన‌ట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్​గా మారింది. ఈ ఘ‌ట‌న‌పై బంజారాహిల్స్ పోలీసులు దృష్టి సారించారు. ఇందుకు సంబంధించిన ఫుటేజీల‌ను ప‌రిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించేందుకు ఈసీ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.