భాజపాతో తెరాసకు లోపాయికారి ఒప్పందం కుదిరిందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి ఆరోపించారు. కేంద్రప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు తెరాస మద్దతు తెలిపిందని విమర్శించారు. మాజీ దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ సంస్కరణలతోనే స్థానిక సంస్థలకు పెద్దఎత్తున నిధులు వస్తున్నాయని ఆయన తెలిపారు.
భాజపా, తెరాసలు కలిసి ప్రభుత్వరంగ వ్యవస్థలను కుప్పకూల్చారని మండిపడ్డారు. గ్రేటర్లో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. బిల్లర్స్ అసోసియేషన్ సభ్యులను మంత్రి కేటీఆర్ మద్దతు కోరడంపై కోదండరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.