బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిన ఘనత తెరాస పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో.. తెరాస 21వ ఆవిర్భావ వేడుకలను ఆయన ఘనంగా జరిపారు. పేదలకు బట్టలు పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నియోజకవర్గంలోని రాంనగర్, అడిక్మెట్, కవాడీ గుడ, భోలక్పూర్, గాంధీ నగర్ డివిజన్లలో.. ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముఠా పద్మ నరేశ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: లండన్లో వైభవంగా "తాల్" వేడుకలు