ETV Bharat / state

TRS Executive Meeting Today : కేసీఆర్ అధ్యక్షతన నేడు తెరాస కార్యవర్గ సమావేశం

TRS Executive Meeting Today: వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసేందుకు తెరాస సిద్ధమవుతోంది. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలను నేడు నియమించే అవకాశం ఉంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన.. నేడు తెరాస విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు రాష్ట్ర కార్యవర్గంతో సమావేశం ఏర్పాటు చేయడంపై రాజకీయాల్లో రకరకాల ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

నేడు తెరాస కార్యవర్గ సమావేశం.. నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీల నియామకం..!

author img

By

Published : Nov 15, 2022, 6:55 AM IST

TRS Executive Meeting Today: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, మరోసారి అధికారం నిలబెట్టుకోవడమే లక్ష్యంగా.. సమగ్ర కార్యాచరణ అమలుపై తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​ దృష్టి సారించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్​లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఆ సమావేశానికి హాజరు కావాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులకు సమాచారం పంపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేసే ప్రధాన ఉద్దేశంతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కలిసి సమన్వయంగా పని చేసేలా నియోజవకవర్గానికి ఓ ఇంఛార్జీని నియమించనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో చోటుచేసుకున్న పలు పరిణామాలపై భేటీలో చర్చించే అవకాశం ఉంది.

తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి రాష్ట్ర నాయకుల వరకు భాజపా పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తున్న తరుణంలో ఎలా తిప్పికొట్టాలనే అంశంపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలకు ప్రలోభాలు వెలుగు చూసినందున.. ప్రజాప్రతినిధులకు గులాబీ దళపతి కీలక సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సిట్టింగ్​లకు మళ్లీ అవకాశమిస్తామని.. గతంలోనే పలు సందర్భాల్లో చెప్పిన పార్టీ అధినేత మరోసారి వారికి భరోసా ఇవ్వనున్నట్లు సమాచారం. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు.. భాజపా, కాంగ్రెస్ ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలా వ్యూహాలను సిద్ధం చేయనున్నారు. కేసీఆర్​ జిల్లాల పర్యటనలపై సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారాస ఆవిర్భావ ప్రక్రియ పూర్తి కాగానే జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, కార్యాచరణపైనా సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవీ చదవండి: రేపు ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలలకు కేసీఆర్ శ్రీకారం

'రాష్ట్రపతి ఓ స్వీట్ లేడీ'.. బంగాల్ మంత్రి వ్యాఖ్యలకు దీదీ క్షమాపణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.