ETV Bharat / state

తెరాస అభ్యర్థుల జాబితా సిద్ధం?

తెరాస పార్లమెంటు అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చింది. అభ్యర్థుల తొలి లేదా పూర్తి జాబితా నేడు విడుదల చేసే అవకాశం ఉంది. పనితీరు, పార్టీకి సేవలు, విధేయత వంటి అంశాలను కేసీఆర్ పరిగణనలోకి తీసుకొని వివిధ కోణాల్లో విశ్లేషించినట్లు తెలుస్తోంది. ఇద్దరు, ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్ దక్కక పోవచ్చునని తెరాస శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది.

అభ్యర్థుల ఎంపికపై విశ్లేషిస్తున్న కేసీఆర్​
author img

By

Published : Mar 17, 2019, 6:27 AM IST

Updated : Mar 17, 2019, 7:51 AM IST

అభ్యర్థుల ఎంపికపై విశ్లేషిస్తున్న కేసీఆర్​
తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు అభ్యర్థుల జాబితా సిద్ధమైనట్లు తెలుస్తోంది. గులాబీ బాస్​ కేసీఆర్ ఇవాళ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఆరు నుంచి తొమ్మిది మంది అభ్యర్థులను... లేదా పూర్తి జాబితాను వెల్లడిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ పరిస్థితులు, సిట్టింగ్ ఎంపీల పనితీరు వంటి వివిధ అంశాలపై సర్వేలు చేయించి నివేదికలను విశ్లేషించినట్లు తెలుస్తోంది. 16 స్థానాల్లో విజయ కేతనం ఎగరేయాలని తెరాస భావిస్తోంది.

తొమ్మిది స్థానాలపై స్పష్టత..

తొమ్మిది స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే స్పష్టత వచ్చింది. కరీంనగర్ నుంచి మళ్లీ వినోద్ కుమార్ పోటీ చేయనున్నారు. నిజామాబాద్ నుంచి కవిత బరిలోకి దిగనున్నారు. సిట్టింగ్ ఎంపీల్లో భువనగిరికి బూర నర్సయ్య గౌడ్, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, జహీరాబాద్​లో బీబీ పాటిల్, ఆదిలాబాద్ నుంచి నగేష్ మళ్లీ అదే స్థానంలో పోటీ చేయనున్నారు. నాగర్ కర్నూలులో మాజీ మంత్రి పి.రాములు అభ్యర్థిత్వం ఖరారైనట్లు తెలుస్తోంది. పెద్దపల్లిలో మాజీ ఎంపీ గడ్డం వివేక్​కు టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. చేవెళ్ల నుంచి కార్తీక్ రెడ్డి పోటీ చేయడం ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది.

ఎదురుచూస్తున్న ఆశావహులు

మిగతా ఎనిమిది స్థానాల్లో కేసీఆర్ ప్రకటన కోసం ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మల్కాజిగిరి నుంచి నవీన్ రావును దింపేందుకు తెరాస మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న మల్కాజిగిరికి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బండి రమేశ్​ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడు సాయికిరణ్, దండె విఠల్, బండి రమేశ్​లలో ఒకరికి దక్కే అవకాశం ఉంది.
ఖమ్మంలో వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలలో ఒకరికి లభించవచ్చు. మహబూబ్​నగర్​లో పారిశ్రామికవేత్త ఎంఎస్ రెడ్డి, మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వరంగల్​లో ప్రస్తుత ఎంపీ పసునూరి దయాకర్​ లేదా మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పోటీ చేసే అవకాశం ఉంది. మహబూబాబాద్​లో ప్రస్తుత ఎంపీ సీతారాం నాయక్ లేదా మాజీ ఎమ్మెల్యే కవిత బరిలో నిలవనున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి: ప్రచార భేరీ మోగించనున్న గులాబీ బాస్​

Last Updated : Mar 17, 2019, 7:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.