జీవితంలో ఎదగాలంటే కష్టపడి చదవడం కాదు... ఇష్టపడి చదవాలని నైనా జైస్వాల్ విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ చంపాపేట్ త్రివేణి హై స్కూల్లో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని తలిదండ్రులకు విజ్జప్తి చేశారు.
పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.25 వేలు చొప్పున పారితోషకాన్ని నైనా జైస్వాల్ చేతుల మీదగా అందజేశారు. జైస్వాల్ ఈ కార్యక్రమానికి రావడం చాల సంతోషంగా ఉందని స్కూల్ ప్రిన్సిపాల్ గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు, ఆటపాటలు అందర్నీ ఆలకట్టుకున్నాయి. కార్పొరేటర్ రమణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తల్లి మృతితో చలించిపోయాడు.. అంతలోనే భార్యతో సహా చనిపోయాడు!