ETV Bharat / state

తల్లి మృతితో చలించిపోయాడు.. అంతలోనే భార్యతో సహా చనిపోయాడు! - ఎల్కతుర్తిలో కారు ప్రమాదం వార్తలు

ఖమ్మంలో నివాసముండే విశ్రాంత సీఐ చాట్ల విజయ్​కుమార్​.. తన తల్లి మరణవార్త విని కుంగిపోయాడు. ఆమె అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఆదిలాబాద్​ బయల్దేరాడు. వరంగల్​ అర్బన్​ జిల్లా పెంచికల్​పేట సమీపంలో తాను ప్రయాణిస్తున్న కారును లారీ ఢీట్టగా.. విజయ్​కుమార్ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.

lorry-hit-car-accident-in-warangal
lorry-hit-car-accident-in-warangal
author img

By

Published : Feb 16, 2020, 9:38 AM IST

Updated : Feb 16, 2020, 10:28 AM IST

తల్లి మృతితో చలించిపోయాడు.. అంతలోనే భార్యతో సహా చనిపోయాడు!

తల్లి మరణవార్త వినగానే కుమారుడు చలించిపోయాడు. ఆఖరి చూపు చూసేందుకు ఖమ్మం నుంచి ఆదిలాబాద్​ బయల్దేరాడు. అంతలోనే వారు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై ఆ కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. ఈ ప్రమాదం వరంగల్​ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్​పేట సమీపంలో జరిగింది.

ఆదిలాబాద్​ జిల్లా టీచర్స్​ కాలనీలో తల్లి శవం ఉండగానే.. సోదరుడు, అతని భార్య మరణించిన వార్త.. ఆ కుటుంబంలో తీరని దుఃఖాన్ని మిగిల్చిందని సుదర్శన్ వాపోయారు. తల్లితో పాటే విజయ్​కుమార్​ దంపతుల అంత్యక్రియలు తానే నిర్వహించనున్నట్లు సుదర్శన్ తెలిపారు.

పెంచికల్​పేట సమీపంలో కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీ కొట్టగా.. చాట్ల విజయ్​కుమార్- సునీత దంపతులు అక్కడికక్కడే మరణించారు. అదే కారులో ప్రయాణిస్తున్న వారి కుమార్తె మౌనిక, కారు డ్రైవర్ వర్ధన్​రెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని హుజూరాబాద్​ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విజయ్​కుమార్ విశ్రాంత సీఐ. మృతదేహాలను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: కేసీఆర్ కటౌట్... మంత్రి తలసానికి జరిమానా

Last Updated : Feb 16, 2020, 10:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.