హైదరాబాద్ ఎల్బీనగర్‌లో నివాసముంటున్న హసీనా అనే మహిళలకు 2017లో అబ్దుల్ సమీ అనే వ్యక్తితో వివాహం జరిగింది. సదరు మహిళ తన భర్త సమీపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెళ్లైనా కొన్నాళ్లకే వరకట్నం పేరుతో తనను వేధించడమే కాకుండా చిత్రహింసలకు గురి చేసేవాడని ఆమె పేర్కొంది. తనను గృహ నిర్భందం చేసి విడాకులు ఇవ్వాల్సిందిగా బలవంతం పెట్టాడని... అనంతరం తలాక్ తలాక్ తలాక్ అని మూడు సార్లు చెప్పి విడాకులు ఇచ్చినట్లుగా చెప్పాడని ఫిర్యాదులో వివరించింది.
రంజాన్ రోజున తనను ఇంటి వద్ద దింపి ఇకనుంచి తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పాడని... విడాకులు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడని అవేదన వ్యక్తం చేసింది. దీనిపై దర్యాప్తు చేసి వివాహ హక్కు చట్టం కింద కేసు నమోదు చేసి సమీని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వివరించారు. నిందితుడు సమీపై గతంలో గృహ హింస చట్టం కింద హసీనా పలు ఠాణాల్లో ఫిర్యాదు చేసిందని పోలీసులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి ఔదార్యం.. తన వాహనంలో ఆస్పత్రికి క్షతగాత్రుడు