ETV Bharat / state

KCR on Birsa Munda Jayanti: 'స్వరాజ్య పోరాటంతో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి బిర్సా ముండా'

KCR on Birsa Munda Jayanti
KCR on Birsa Munda Jayanti
author img

By

Published : Nov 15, 2021, 3:30 PM IST

14:15 November 15

KCR on Birsa Munda Jayanti: బిర్సా ముండా జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ నివాళులు

  • ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ బిర్సా ముండా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించారు. #BirsaMunda

    — Telangana CMO (@TelanganaCMO) November 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆదివాసీ గిరిజన నాయకుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా జయంతి (birsa munda jayanti)  సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​ నివాళులు (Tributes to Chief Minister KCR on the occasion of Birsa Munda Jayanti) అర్పించారు. స్వరాజ్యం కోసం.. ఆదివాసీ గిరిజనుల ఆత్మగౌరవం కోసం... వారి హక్కుల కోసం.. పోరాడుతూ.. అతిచిన్న వయసులో ప్రాణత్యాగం చేసిన బిర్సాముండా చిరస్థాయిగా నిలిచారన్నారు. తెలంగాణ స్వయం పాలనలో గిరిజనులు, ఆదివాసీల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ.. వారి అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని సీఎం కేసీఆర్​ (cm kcr talk about birsa munda jayanti) పేర్కొన్నారు.

ఎవరీ బిర్సా ముండా?

గిరిజనుల్లో సామాజిక సంస్కరణలు తీసుకురావడానికీ బిర్సా ముండా కృషి చేశారు. మద్యపానాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపడానికి ఉద్యమించారు. దైవంపై విశ్వాసం ఉంచి, సత్ప్రవర్తనను అలవరచుకోవాలని బోధించారు. గిరిజనులు తమ మూలాలను తెలుసుకొని, ఐక్యంగా మెలగాలని పిలుపిచ్చారు. వనపుత్రుల్లో చైతన్యం తెచ్చి, వారిని ఏకతాటిపై నడిపారు. అందువల్లే బిర్సా ముండాను ‘భగవాన్‌’ అని సంబోధించేవారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల్లో బిర్సా ముండాకు విశిష్ట స్థానం ఉంది. కేవలం 25 ఏళ్ల వయసులో ఆయన చేసిన త్యాగాలు, సాధించిన విజయాలు అసామాన్యమైనవి. ఆయన జరిపిన పోరాటాల వల్లనే బ్రిటిష్‌ వలస పాలకులు గిరిజనుల భూ హక్కులను గుర్తిస్తూ చట్టాలు చేశారు. పిన్న వయసులోనే అమరులైనా- ఆయన తెచ్చిన సాంఘిక, సాంస్కృతిక విప్లవం గిరిజనుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసింది. బ్రిటిష్‌ వారిపై గిరిజనులు జరిపిన సాయుధ పోరాటం వారి దేశభక్తికి తిరుగులేని నిదర్శనం. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా మనం   జరుపుకొంటున్న ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’లో మాతృదేశం కోసం గిరిజన వీరులు చేసిన త్యాగాలను స్మరించుకొంటున్నాం.

మోదీ సైతం నివాళులు...

మరోవైపు, ఝర్ఖాండ్ ఆదివాసీ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు మోదీ. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన చేసిన కృషి దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎల్లప్పుడు పేదలు, అణగారిన వర్గాల పక్షానే నిలిచి పోరాటం చేశారని కీర్తించారు.

1875 నవంబర్ 15న అప్పటి బ్రిటీష్ సామ్రాజ్యంలోని ఝార్ఖండ్​ ప్రాంతంలో జన్మించారు బిర్సా ముండా. ఆదివాసీలతో కలిసి బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 25 ఏళ్ల యువ ప్రాయంలోనే బ్రిటీష్ కస్టడీలో మరణించారు. 2000 సంవత్సరంలో ఆయన జయంతి రోజునే ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది.

బిర్సా ముండా స్మారకార్థం

గిరిజన స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సా ముండా స్మారకార్థం ఝార్ఖండ్​ (Jharkhand Birsa Munda) రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో.. గిరిజన యోధుల సాహసాలు, వారి సంప్రదాయాలకు తగిన గుర్తింపు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. బిర్సా ముండా జయంతి (Birsa Munda jayanti) అయిన నవంబర్ 15ను ఇక నుంచి ఏటా 'జనజాతీయ గౌరవ్ దివస్​'గా జరుపుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Mమోodi news) ప్రకటించారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.