Tribes facing Problems without amenities: దేశంలో అట్టహాసంగా ఆజాది కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటున్నాం. అయినప్పటికీ చాలా ప్రాంతాలకు మౌలిక వసతులు అందక అవస్థలు పడుతూనే ఉన్నారు. దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా మాడుగుల రావికమతం మండలాల సరిహద్దులోని గిరిజనులు అనేక అవస్థలు పడుతున్నారు. పాఠశాల వెళ్లేందుకు విద్యార్థులకు రహదారి సదుపాయం లేకపోవడంతో గుర్రాలపై వెళుతూ పాఠాలు నేర్చుకుంటున్నారు.
రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ శివారు నేరేడుబంధ అటవీ ప్రాంతంలో 12 కుటుంబాలు ఆదివాసులు జీవనం సాగిస్తున్నాయి. వీరు అంతా చదువుకోవడానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోగంపేట పాఠశాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇందుకోసం ఎత్తైన కొండలు, గుట్టలు, తుప్పలు, డొంకలు దాటాల్సి వస్తోంది. ఈ గ్రామానికి చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఇటీవలే శ్రమదానంతో బాటను ఏర్పాటు చేసుకున్నారు. రోజు కాలినడకన వెళ్లలేక వారి వద్ద పెరుగుతున్న గుర్రాలపై బడికి వెళ్తున్నారు. కనీసం అంగన్వాడీ కేంద్రం కూడా లేదు. ఈ ప్రాంతంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం మాకెందుకు.. ఈ బతుకు మాకెెందుకు అన్నట్లుగా ఉంది మా పరిస్థితి. ఈ వార్త చూసైనా ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే ఎవరికైనా మాపై జాలి పుట్టి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాం.-గ్రామస్థుడు
ఇవీ చదవండి: