ETV Bharat / state

ధరణిలో ఐచ్ఛికాలు ఇస్తేనే సమస్యలకు పరిష్కారం.. హరీశ్​రావుకు ట్రెసా విజ్ఞప్తి

ధరణి సమస్యలపై మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao)కు ట్రెసా ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ధరణిలో ఐచ్ఛికాలు ఇస్తేనే సమస్యలన్నీ తొలగిపోతాయని... ట్రెసా మంత్రికి విజ్ఞప్తి చేసింది.

Tresa appeals to minister Harish Rao about dharani portal problems
ధరణిలో ఐచ్ఛికాలు ఇస్తేనే సమస్యలకు పరిష్కారం
author img

By

Published : Nov 9, 2021, 6:40 AM IST

భూ యజమానులందరికీ స్పష్టమైన యాజమాన్య హక్కులు కల్పిస్తేనే గ్రామ స్థాయిలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని మంత్రివర్గ ఉప సంఘం (ధరణి) ఛైర్మన్‌, ఆర్థికమంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao)కు ట్రెసా విజ్ఞప్తి చేసింది. 13 ప్రధానమైన భూ సమస్యలతో కూడిన నివేదికను ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్‌తో కూడిన బృందం మంత్రికి అందజేసింది.

ధరణి(dharani portal)లో నమోదైన భూములకు సంబంధించి క్రయ విక్రయాల అనంతరం రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు వెను వెంటనే జరుగుతున్నాయని, రికార్డుల్లో యజమానుల పేరు మార్పిడి పూర్తయి పట్టా పాసుపుస్తకం జారీ అవుతోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో నిషేధిత జాబితా (పీఓబీ), విస్తీర్ణంలో వ్యత్యాసాలు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూములుగా నమోదుకావడం వంటి కీలక సమస్యలు క్షేత్రస్థాయిలో ఉన్నాయని తెలిపారు. వాటిని తొలగించి స్పష్టంగా హక్కులు కల్పిస్తేనే వాటి యజమానులకు రైతుబంధు, బీమా అందించడానికి వీలుంటుందని వారు తెలియజేశారు. దీనికోసం ధరణిలో అవసరమైన ఐచ్ఛికాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రెండు మూడు రోజుల్లో ధరణి సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారని భేటీ అనంతరం వారు ఒక ప్రకటనలో తెలిపారు.

మంత్రి హరీశ్‌రావుకు వినతిపత్రం అందజేస్తున్న ట్రెసా ప్రతినిధులు

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల పోర్టల్‌ ధరణి బాధ్యతలను డిప్యూటీ తహసీల్దార్లకు రెండు మూడు రోజుల్లో అప్పగించనున్నట్లు తెలిసింది. పోర్టల్‌ లాగిన్‌ కీ, బయోమెట్రిక్‌లను పూర్తిగా డీటీలకు అప్పగించి ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తహసీల్దార్లకు ఇతర రెవెన్యూ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షించేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఇదీ చూడండి: వినియోగదారుల హక్కులకేదీ భరోసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.