హైదరాబాద్ నగరంలో ట్రాన్స్ జెండర్లపై జరుగుతున్న దాడులు, వారిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ట్రాన్స్ జెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశమైంది. కార్యక్రమంలో పలువురు ట్రాన్స్ జెండర్లు పాల్గొని హత్యకు గురైన హంసకు మద్దతు తెలిపారు. తమకు కొన్ని విలువలు ఉంటాయని.. వాటి ప్రకారమే నడుచుకుంటామన్నారు. నగరంలోని కొందరు నకిలీ ట్రాన్స్ జెండర్స్ ఉన్నారని....వారి గుర్తించాలని కోరారు.
రెండు గ్రూప్‌ల మధ్య ఆధిపత్య పోరు వలనే హంస హత్య జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు. న్యాయమూర్తి ఎదుట హంస ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం నిందితులను అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా చూసుకుంటాం'