Transfers in Telangana Commercial Tax Department : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం అధికార యంత్రాంగంలో మార్పులు, చేర్పులు చేస్తోంది. అధికారులు, ఉద్యోగుల బదిలీలు, పోస్టింగుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్(IAS Transfers in Telangana), ఐపీఎస్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు సహా ఇతర అధికారులను బదిలీ చేయగా.. తాజాగా వాణిజ్య పన్నుల శాఖలోనూ భారీగా పదోన్నతులు, బదిలీలు చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Commercial Tax Officers Postings 2023 : రెండేళ్ల కిందట పదోన్నతులు పొందిన, దీర్ఘకాలికంగా ఒకే చోట పని చేస్తున్న వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. ఏడుగురు అదనపు కమిషనర్లు, 24 మంది ఉప కమిషనర్లు, 40 మంది సహాయ కమిషనర్లకు మొత్తం 71 మంది అధికారులకు పోస్టింగులు ఇస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా జిల్లాల్లో పని చేస్తున్న అధికారులను హైదరాబాద్‌కు.. ఇక్కడ పని చేస్తున్న ఉద్యోగులను జిల్లాలకు బదిలీ చేస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు.
దాదాపు 185 మంది అధికారులు పోస్టింగ్‌ల కోసం వేచి చూస్తుండగా.. 71 మందికి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన వారికి ఒకట్రెండు రోజుల్లో పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏడుగురు అదనపు కమిషనర్లలలో.. ఎకనామిక్ అడిట్ యూనిట్ అదనపు కమిషనర్‌గా ఎస్.వి.కాశీ విశ్వేశ్వర రావు, ఎన్ఫోర్స్మెంట్ అదనపు కమిషనర్లుగా ఎస్.జయకామేశ్వరి, సాయికిషోర్, ఆడిట్స్, జీఎస్టీ పాలసీ విభాగపు అదనపు కమిషనర్‌గా ఫణీందర్ రెడ్డి, లీగల్ విభాగపు అదనపు కమిషనర్‌గా ద్వారకానాథ్ రెడ్డి, ఎస్టాబ్లిషమెంట్ అదనపు కమిషనర్‌గా వై.సునీతలను నియమించారు.
Municipal Commissioners Transfers : రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ
Promotions in Telangana Commercial Tax Department : అదేవిధంగా రాష్ట్రంలోని 12 డివిజన్లకు 12 మంది డిప్యూటీ కమిషనర్లను, ముగ్గురిని అడిట్ డీసీలుగా, మిగిలిన వారిని కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. డివిజన్ల వారీగా నియామకమైన 24 మంది వాణిజ్య పన్నుల శాఖ ఉప కమిషనర్లకు పోస్టింగులు ఇచ్చారు. వ్యాట్ ట్రైబ్యునల్‌కు ఉప కమిషనర్‌గా శ్రీనివాసులు, మాదాపూర్ డివిజన్ ఉప కమిషనర్‌గా-కె.గీత, అబిడ్స్ డీసీగా-జి.లావణ్య, మల్కాజ్గిరి-శాంతకుమారి, సికింద్రాబాద్-వాసవి జగన్నాధం, పంజాగుట్ట-దీపా రెడ్డి , వరంగల్-రాజేష్ కుమార్, సరూర్‌నగర్-పి.నాయనార్, హైదరాబాద్రూరల్-రామకృష్ణారావు, చార్మినార్-అమర్ నాయక్, బేగంపేట్-శశిధరాచారి, నల్గొండ-రాధాకృష్ణ, నిజామాబాద్-ఏడుకొండలు, ఆదిలాబాద్-టి.శ్రీనివాస్, పంజాగుట్ట అడిట్ డీసీ(ఏడీసీ)గా సుధాకర్ రెడ్డి, సికింద్రాబాద్ అడిట్ డీసీ(ఏడీసీ)గా ఆనంద్ కుమార్, హైదరాబాదు రూరల్ ఏడీసీగా శ్రీలీల లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీటీవోల బదీలీ: వీరితో పాటు రాష్ట్రంలో మరో 83మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారుల బదిలీ కూడా జరిగింది. మల్టీ జోన్-1లో 21 మంది, మల్టీ జోన్-2లో 62 మందిని బదిలీ చేస్తూ వాణిజ్య పన్నుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల్లో పని చేస్తున్న సీటీవోలను హైదరాబాద్‌కు, నగరంలో పని చేస్తున్న సీటీవోలను జిల్లాలకు బదిలీ చేశారు. గత మూడేళ్లలో సీటీవోల పనితీరు ప్రామాణికంగా పోస్టింగ్‌లు ఇచ్చారు.
Tax Department: పదోన్నతులు కల్పించారు.. పోస్టింగ్‌లు ఇవ్వడం మరిచారు
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది చివరలో ఎన్నికలు(Telangana Assembly Elections 2023) జరగనున్న రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టింగుల విషయమై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో ముగియనుండగా.. మధ్యప్రదేశ్ గడువు జనవరి 6, మిజోరాం అసెంబ్లీ గడువు డిసెంబర్ 17, ఛత్తీస్‌గడ్ గడువు జనవరి 3, రాజస్థాన్ అసెంబ్లీ గడువు జనవరి 14తో పూర్తి కానుంది. దీంతో ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులకు ఈసీ(Telangana Election Commission) అదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణ విధుల్లో నేరుగా ఉండే అధికారులను సొంత జిల్లాల్లో.. ఎక్కువ కాలం పని చేసిన ప్రాంతాల్లో ఉండరాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఒకేచోట మూడేళ్ల గడువు మించరాదని స్పష్టం చేసింది.
3 Additional DG gets DG : ముగ్గురు డీజీలుగా పదోన్నతి.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
IAS Transfers in Telangana : నలుగురు ఐఏఎస్‌లు బదిలీ.. జీహెచ్ఎంసీకి కొత్త కమిషనర్